వెర్రి వేయి విధాలు .. పుచ్చకాయను బజ్జీలా వేయిస్తారా ??

|

Jun 09, 2023 | 9:49 AM

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. కానీ మరీ ఇంతగానా... చాలామంది వెరైటీ ఫుడ్‌ను ఇష్టపడుతుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని మన స్ట్రీట్‌ఫుడ్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్తరకం వంటకాన్ని పరిచయం చేస్తున్నారు. వాటిలో కొన్ని శభాష్‌ అనిపించుకున్నా.. కొన్ని బెడిసి కొట్టేవీ వుంటాయి.

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. కానీ మరీ ఇంతగానా… చాలామంది వెరైటీ ఫుడ్‌ను ఇష్టపడుతుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని మన స్ట్రీట్‌ఫుడ్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్తరకం వంటకాన్ని పరిచయం చేస్తున్నారు. వాటిలో కొన్ని శభాష్‌ అనిపించుకున్నా.. కొన్ని బెడిసి కొట్టేవీ వుంటాయి. తాజాగా ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే.. ఇదేం వంటకంరా బాబూ.. ప్రకృతి ప్రసాదించిన చక్కని ఫ్రూట్‌ను పొల్యూట్‌ చేసి పడేసావు కదా.. అనకుండా ఉండలేరు. ఎందుకంటే మరి ఇతను పుచ్చకాయతో బజ్జీ వేశాడు. ఇప్పుడు చెప్పండి మీరేమంటారో.. వేసవి కాలంలో ప్రజలు పుచ్చకాయను ఎక్కువగా తింటుంటారు ప్రజలు. ఈ జ్యూసీ ఫ్రూట్ వాటర్‌ కంటెంట్‌ అధికంగా ఉండి, ఆరోగ్యంతో పాటు శరీరానికి చల్లదనాన్ని కూడా కలిగిస్తుంది. వాటర్‌ మిలన్‌ జ్యూస్‌గా కూడా తాగుతారు. పండ్ల విషయంలో ప్రతిఒక్కరూ తాజా పండ్లను నేరుగా తినడానికే ఇష్టపడతారు. అయితే, పుచ్చకాయను నూనెలో వేయించి తినటం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా..? ఇది వింటుంటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ! ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పుచ్చకాయను బాగా వేయించి తిన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆవాలతో అద్భుతం.. ఆకట్టుకుంటున్న మైక్రో ఆర్ట్‌

ఏఐ చాట్ బాట్ ను పెళ్లాడిన మహిళ.. తగిన వరుడు అంటున్న భామ

Follow us on