Viral Video: ఇలాంటి డ్యాన్స్ ఇంతవరకు చూసి ఉండరు.. ట్రెండవుతోన్న జవాన్ స్టెప్పులు.. చూస్తే వావ్ అనాల్సిందే..
నెట్టింట్లో ప్రతిరోజు ఎన్నో వీడియోలో వచ్చి చేరుతుంటాయి. అందులో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. వీటిటో కొన్ని తెగ ఆకట్టుకుంటే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. కొన్ని మాత్రం ఏడిపిస్తుంటాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్ వీడియో..
నెట్టింట్లో ప్రతిరోజు ఎన్నో వీడియోలో వచ్చి చేరుతుంటాయి. అందులో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. వీటిటో కొన్ని తెగ ఆకట్టుకుంటే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. కొన్ని మాత్రం ఏడిపిస్తుంటాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్ వీడియో(Viral Video) మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా(Social Media)ను హల్ చల్ చేస్తోన్న వైరల్ వీడియోలో వ్యక్తి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన డ్యాన్స్ కదలికల్లో స్టెప్పులు చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే. ఇందులో ఆ వ్యక్తి మార్చ్ పాస్ట్ చేస్తూ.. కొన్నిసార్లు సెల్యూట్ కూడా చేస్తున్నట్లు చూడొచ్చు. దీంతో అతను సైనికుల్లా మార్చ్ పాస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఓ ఐపీఎస్ అధికారి ట్విటర్‌లో ఫన్నీ క్యాప్షన్‌తో ఈ వీడియోను పంచుకోవడంతో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.
వీడియోలో, ఒక వ్యక్తి డ్రమ్స్ వాయిస్తూ ప్రజల మధ్య డ్యాన్స్ చేస్తున్నాడు. అతను డ్రమ్స్ ట్యూన్‌కు మార్చ్ పాస్ట్‌లో ఎడమ వైపుతోపాటు కుడి వైపు మార్చ్ పాస్ట్ చేస్తూ సందడి చేశాడు. దీంతో పాటు మధ్యలో నడుస్తూ, అతను తన కుడి చేతితో సెల్యూట్ చేస్తూ కూడా కనిపించాడు. దీని తర్వాత అతను రెండడుగులు వెనక్కి వెళ్లి మళ్లీ సెల్యూట్ చేసి, ఆ తర్వాత సంగీతానికి అనుగుణంగా చిందులు వేశాడు.
డప్పుల దరువుకు అనుగుణంగా శరీరంలోని పై భాగాన్ని ఒక ప్రత్యేకమైన స్టెప్పుతో హల్ చల్ చేశాడు. మధ్యమధ్యలో కొట్టుకోవడం కూడా కనిపిస్తుంది. వీడియో చివర్లో, మరొక వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి వద్దకు వచ్చి అతని చెవిలో ఏదో చెప్పడం చూడొచ్చు. ఆ తర్వాత మళ్లీ రచ్చ మొదలుపెడతాడు.
ఈ వీడియోను పంచుకుంటూ, IPS దీపాంశు కబ్రా – ‘శిక్షణ ముగిసిన వెంటనే ఆ యువకుడు స్నేహితుడి ఊరేగింపునకు చేరుకున్నాడు’ అంటూ రాసుకొచ్చాడు. గురువారం ఆయన ఈ వీడియోను పంచుకున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది వీక్షించారు. పోస్ట్‌కి దాదాపు 20 వేల మంది లైక్‌లు కూడా వచ్చాయి. వీడియో చూసిన జనాలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కామెంట్ సెక్షన్‌లో తమదైన శైలిలో కామెంట్లను పంచుకుంటున్నారు. సీవో సాబ్ వివాహంలో యువకుడు తన వంతు కృషి చేస్తున్నాడంటూ కామెంట్ చేయగా, అతను ఇంకా శిక్షణ పొందుతున్నట్లు కనిపిస్తోందంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు.
ఇంతకు ముందు కూడా ఇలాంటి ఢిపరెంట్ డ్యాన్సుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఊరేగింపులో కొంతమంది బహిరంగంగా నృత్యం చేస్తూ కనిపిస్తుంటారు. ప్రొఫెషనల్ డ్యాన్స్ తెలియని వారు.. తమ మనసుకు తగ్గట్టుగా స్టెప్పులు వేసి చుట్టూ ఉన్న జనాల్ని సందడి చేస్తుంటారు.
ट्रेनिंग खत्म होते ही दोस्त की बारात में पहुंचा जवान. ? pic.twitter.com/Vh7BqQokaZ
— Dipanshu Kabra (@ipskabra) April 21, 2022
మరిని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: Viral Photo: 7గురు వ్యక్తులు.. ఓ పిల్లి.. ఈ ఫోటోలో మీకు కనిపిస్తే.. మీ మెదడుకు పదునున్నట్లే!
Mirnalini Ravi: కుర్రకారు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అందాలతార మృణాళిని..