ప్రేమించిన యువతితో పెళ్లి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు.. ఆ తర్వాత

Updated on: Sep 02, 2025 | 6:29 PM

ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు ఓ యువకుడు. తనకు ఆ అమ్మాయితోనే వివాహం జరిపించాలని సెల్‌ టవర్‌ ఎక్కి హంగామా చేశాడు. చివరికి పోలీసులు యువతితో పెళ్లి జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి యువకుడిని కిందకు దించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

శ్రీకాకుళంలోని పొందూరు మండలం కింతలి కనిమెట్టకు చెందిన శివకుమార్, ఎచ్చెర్ల మండలం ఇబ్రహీం బాద్ కి చెందిన యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరుకావడంతో అమ్మాయి తరపువారు వీరి పెళ్లికి నిరాకరించారు. దీంతో శివకుమార్‌ తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించాలని సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. కులాలు వేరు కావడంతోనే తమ పెళ్లికి అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌లో తప్పుడు కేసులు కూడా బనాయించారని ఆరోపించాడు. ఈ క్రమంలో 112కి కాల్‌ చేసి తన గోడును పోలీసులకు తెలియజేశాడు. అనంతరం శివకుమార్‌ సెల్‌ టవర్‌ ఎక్కాడు. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని శివకుమార్‌కు నచ్చజెప్పి కిందకి దింపే ప్రయత్నం చేశారు. చట్టప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అనంతరం అతడిని కిందకు దింపారు. అనంతరం ఆ యువకుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

A. R. Rahman: ఇలాంటి మూవీకి పనిచేయడం ప్రతి సంగీత దర్శకుడి కల

LPG Price: గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

ఖాతాదారుల బంగారాన్ని స్వాహా చేసిన బ్యాంక్‌ మేనేజర్‌,క్యాషియర్‌

బయటి నుంచి వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకున్న వ్యక్తి.. కాసేపటికే నురగలు కక్కుతూ

Earthquake: భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి