Viral: ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
హాస్పిటల్‌కి వెళితే ఏవో మాయమాటలు చెప్పి అమాయక పేదల నుంచి కిడ్నీని మాయం చేసే కేటుగాళ్ల గురించి విన్నాం. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా అవయవాన్ని అమ్మి సొమ్ము చేసుకునే కిడ్నీ రాకెట్ల బాగోతాలు అక్కడక్కడా హాస్పిటల్స్‌లో బయటపడుతూనే ఉన్నాయి. కిడ్నీని బయటకు తీసి అమ్ముకున్నారనే అనుమానంతో ఒడిశాలో ఓ కుటుంబం కేసు ఫైల్ చేసింది.
ఒడిశాలో రోడ్డు ప్రమాదంలో ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి పొత్తి కడుపుపై ఆపరేషన్ చేసిన గుర్తులున్నాయంటూ కుటుంబ సభ్యులు పోలీసుల మెట్లెక్కారు. తలకు గాయమై ఆసుపత్రిలో చేరితే పొత్తికడుపుపై శస్త్రచికిత్స చేసిన గుర్తులు ఉన్నాయని మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వెలికితీశారు. ఒడిశాలోని కటక్‌లో ఈ ఘటన జరిగింది. అక్టోబరు 13న బాబులాదిగల్ అనే వ్యాపారి తన భార్య, కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై రాంపూర్‌కు వెళ్తుండగా.. మినీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబులాదిగల్ తలకు గాయమైంది. కుటుంబసభ్యులు కటక్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అతణ్ని తీసుకువెళ్లారు. అక్కడ చికిత్సపొందుతూ మూడు రోజుల తర్వాత బాబులాదిగల్ మృతి చెందాడు. అంత్యక్రియల సమయంలో అతడి పొత్తికడుపుపై కత్తిగాట్లను గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారి సుశాంత్ సాహు తెలిపారు. బాబులాదిగల్ కుటుంబసభ్యుల ఆరోపణను ఆసుపత్రి మేనేజరు ఖండించారు. ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి ముకేశ్ మహాలింగ్ ఈ వివాదంపై విచారణకు ఆదేశించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.