Flight Hijack: ఒక్క బెదిరింపుతో నిలిచిపోయిన విమానం..ఏం జరిగిందంటే..?

|

Jun 27, 2023 | 8:18 AM

ఇటీవల విమానాల్లో ప్రయాణికులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. సిబ్బందిపట్ల, తోటి ప్రయాణికుల పట్ల వారు ప్రవర్తించే తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు చేసిన బెదిరింపుతో ఏకంగా నాలుగ్గంటలు విమానాన్ని నిలిపివేశారు.

ఇటీవల విమానాల్లో ప్రయాణికులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. సిబ్బందిపట్ల, తోటి ప్రయాణికుల పట్ల వారు ప్రవర్తించే తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు చేసిన బెదిరింపుతో ఏకంగా నాలుగ్గంటలు విమానాన్ని నిలిపివేశారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విస్తారా ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ కు సిద్ధమైంది. టేకాఫ్ తీసుకుంటుందనగా.. ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా ‘హైజాక్ హైజాక్’ అంటూ పెద్దగా అరిచాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు అందరూ హడలిపోయారు.

రంగంలోకి దిగిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేశారు. హైజాక్ అని అరిచిన రితేష్ సంజయ్ కుమార్ జునేజాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం విమానంలోని ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. విమానం మొత్తాన్ని తనిఖీ చేశారు. దీంతో సాయంత్రం ఆరున్నర గంటలకు బయల్దేరాల్సిన విమానం రాత్రి పదిన్నర గంటలకు టేకాఫ్ అయింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీన్ని విస్తారా ఎయిర్ లైన్స్ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. విస్తారా ఫ్లయిట్ యూకే 996 లో ఓ ప్రయాణికుడు వికృతంగా వ్యవహరించినట్టు తెలిపారు. ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగా లేనందువల్లే అలా చేశాడని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..