Viral Video: పాతికేళ్ల స్నేహ బంధం.. ఓ మనిషితో అడవి పంది సావాసం.. వైరల్‌ అవుతున్న విచిత్ర బంధం

|

Jun 02, 2022 | 8:17 AM

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలో మహేంద్ర అనే వ్యక్తి నివసిస్తున్నాడు. 25 ఏళ్ల క్రితం మహేంద్ర నివసిస్తున్న ప్రాంతానికి వరదలు రాగా.. ఆ వరదల్లో ఓ అడవి పంది పిల్ల కొట్టుకొచ్చింది. నీటిలో కొట్టుకుపోతున్న దానిని మహేంద్ర రక్షించి..


చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలో మహేంద్ర అనే వ్యక్తి నివసిస్తున్నాడు. 25 ఏళ్ల క్రితం మహేంద్ర నివసిస్తున్న ప్రాంతానికి వరదలు రాగా.. ఆ వరదల్లో ఓ అడవి పంది పిల్ల కొట్టుకొచ్చింది. నీటిలో కొట్టుకుపోతున్న దానిని మహేంద్ర రక్షించి.. ఆహారం అందించి రక్షణ కల్పించాడు. అప్పటి నుంచి ఆ పంది పిల్ల అతని కుంటుంబంలో ఓ మెంబర్‌ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత అటవీ శాఖ సిబ్బందికి సమాచారమందించాడు. చిన్న పిల్లను అడవిలో వదిలితే క్షేమం కాదని, మహేంద్రనే ఆ పంది పిల్లని పెంచమని చెప్పారు అటవీ అధికారులు. దీంతో చేసేది లేక తానే ఆ పందిని పెంచుకున్నాడు. ముద్దుగా దానికి రాజు అని పేరు పెట్టుకున్నాడు.అది పెరిగి పెద్దయ్యాక అటవీశాఖ అధికారులు అడివిలో విడిచి పెట్టారు. అయినా అది తిరిగి మహేంద్ర వద్దకు వచ్చేసింది. ఎన్నిసార్లు అడవిలో వదలినా అది తిరిగి వచ్చేస్తోంది. మహేంద్రను విడిచి ఒక్క క్షణం కూడా ఉండటంలేదు ఆ పందిపిల్ల. అతను ఏం పెడితే అదే తింటుంది. అతను కనిపించకపోతే ఆ రాత్రి అది నిద్రకూడా పోదు. అలా వీరిద్దరిమధ్య పాతికేళ్లుగా ఓ బంధం ఏర్పడింది. ఇప్పుడు స్థానికులు కూడా దానికి స్నేహితులయిపోయారు. ఇప్పటి వరకూ అది ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదు. ఆహారం కోసం కొన్నిసార్లు అడవిలోకి వెళ్లినా సాయంత్రం అయ్యేసరికి తిరిగి మహేంద్ర ఇంటికి చేరుకుంటుంది. అది తన వద్దకు వచ్చిన సమయంలో దాని బరువు 400 గ్రాములు ఉందని.. ఇప్పుడు మంచి పుష్టిగా తయారైందని చెబుతున్నాడు. మహేంద్ర తాను తినే ఆహారాన్నే దానికి పెడతానని, అది నాన్‌ వెజ్‌ తినదని చెబుతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య స్నేహం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరి స్నేహానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 02, 2022 08:17 AM