Lover Frogs: ప్రేమ ఎంత మధురమో.. ఆడ కప్పల కోసం రంగులు మారుస్తున్న మగ కప్పలు..

Updated on: Jul 04, 2022 | 9:14 AM

కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో చెరువులు, గుంటలు నిండటంతో వాటిలో కప్పలు సందడి చేస్తున్నాయి. అయితే


కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో చెరువులు, గుంటలు నిండటంతో వాటిలో కప్పలు సందడి చేస్తున్నాయి. అయితే ఈ కప్పలు పసుపు వర్ణంలో ఉండి చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతో వింతగా చూస్తున్నారు స్థానికులు. అయితే ఇవి సాధారణ కప్పలే అంటున్నారు పశుసంవర్ధక అధికారులు. అయితే ఇవి ఇలా రంగు మార్చేది వాటి గర్ల్‌ కప్పల కోసమట. ఆడ కప్పలను ఆకర్షించడానికి మగ కప్పలు అలా రంగులు మార్చుకుంటాయట. అయితే అధికారులు చెప్పినట్టుగానే ఆ రంగులు మార్చుకున్న మగ కప్పలను ఆడ కప్పలు ఆకర్షించాయి. పసుపు కప్పలతో జతకట్టాయి. నిన్న పసుపు కప్పలు ఒకటే దర్శనమిచ్చిన చోట నేడు ఆడకప్పలతో కలిసి రెండు సందడి చేశాయి. ఇవి చూసిన జనం మంత్రముగ్ధులవుతున్నారు. అమ్మాయిలను ఆకర్షించడానికి అబ్బాయిలు రకరకాల వేషాలు వేసినట్టు ఈ కప్పలు కూడా వారికి మేమేమీ తక్కువ కాదంటున్నాయి. మాకూ ప్రేమంటే తెలుసు.. ప్రేమలో ఎలా పడేయాలో తెలుసు అన్నట్టుగా సందడి చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 04, 2022 09:14 AM