Orangutan: పులి పిల్లలకు పాలుపడుతున్న ఒరెంగుటాన్.. స్వచ్ఛమైన అమ్మప్రేమకు నెటిజన్లు ఫిదా..
జంతువులు మాట్లాడలేక పోవచ్చు.. కానీ అవి కూడా మనుషులకు ఏమాత్రం తక్కువ కాదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో.
జంతువులు మాట్లాడలేక పోవచ్చు.. కానీ అవి కూడా మనుషులకు ఏమాత్రం తక్కువ కాదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. కొందరు మనుషుల్లో లాగానే జంతువుల్లో కూడా జాలి, దయ, కరుణ ఉంటాయి. మనుషులు మాటలతో వ్యక్తీకరిస్తే మూగ జీవులు వాటి చేతలతో చూపుతాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒరంగుటాన్ పులి పిల్లలను తన బిడ్డల్లాగే పెంచుతోంది. వాటికి బాటిల్‌తో పాలు పడుతోంది. తన భుజాలై ఎక్కించుకొని ఆడిస్తోంది. వాటితో ఎంతో ప్రేమగా మెలుగుతుంది. ఆ పులిపిల్లలు ఒరంగుటాన్ దగ్గరకి ఎలా చేరాయో కానీ దాని రూపంతో ఏమాత్రం సరిపోలని ఆ చిన్ని కూనలకు కన్న బిడ్డల్లా తన ప్రేమను పంచుతోంది. అద్భుతమైన ఈ వీడియోను డాక్టర్ సామ్రాట్ గౌడ ఐఎఫ్ఎస్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్ సఫారీలో చిత్రీకరించారు. ఈ వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది. లక్షమందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. వేలల్లో లైక్ చేస్తున్నారు. “అమ్మ ప్రేమ షరతులు లేనిది స్వచ్ఛమైనది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

