పంట నష్టం కింద రైతుకు పరిహారంగా రూ.2.30

Updated on: Nov 06, 2025 | 3:29 PM

మహారాష్ట్రలోని శిలోత్తర్‌ గ్రామానికి చెందిన మధుకర్‌ బాబూరావు అనే రైతుకు షాకింగ్‌ అనుభవం ఎదురైంది. బాబూరావు.. ‘పీఎం ఫసల్‌ భీమా యోజన’ కింద తాను వేసిన పంట కోసం జూలై 16న రూ.1148 ప్రీమియం కట్టారు. ఇటీవల అకాల వర్షాలతో ఆయన వేసిన పంటకు తీవ్ర నష్టం వచ్చింది. అకాల వర్షాలతో 6.5 ఎకరాల్లో వేసిన పంట తుడిచిపెట్టుకుపోవడంతో ప్రభుత్వం నుంచి పరిహారం కింద వచ్చే మొత్తంతో పెట్టుబడి ఖర్చులైనా మిగులుతాయని ఆ రైతు ఆశించాడు.

ఆ రైతు ఖాతాలో ప్రభుత్వం వేసిన మొత్తమెంతో తెలుసా? కేవలం రెండు రూపాయల ముప్పై పైసలు! 6.5 ఎకరాల్లో పంట నష్టాన్ని లెక్కగట్టిన వ్యవసాయాధికారులు బాబూరావుకు పరిహారం కింద రూ.1,53,110 వస్తాయని తేల్చారు. అక్టోబరు 31న ఆయన ఖాతాలో రూ.2.30 మాత్రమే వేశారు. అవాక్కయిన బాబూరావు.. అధికారులను సంప్రదించగా పొరపాటైందంటూ నాలుక్కరుచుకున్నారు. 2023లోనూ బాబూరావుకు పంట నష్టం జరిగింది. అప్పట్లో ఆయనకు పరిహారం కింద రూ.72,466 రావాలి. కానీ రూ.72,463.70 మాత్రమే ఖాతాలో వేశారు. అప్పట్లో ఆ మిగిలిన రూ.2.30ను ఇప్పుడు ఇచ్చారన్నమాట! సాంకేతిక సమస్య వల్లే అలా జరిగినట్లు అధికారులు అంగీకరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీ షాక్‌‌లో డొనాల్డ్ ట్రంప్.. స్వయంగా ప్రచారం చేసినా ఓటమి

పిల్లలను తినేస్తున్న పులి.. పాపం చిన్నారి

శివాలయంలో పునరుద్ధరణ వేళ.. బయటపడిన నిధి

వరదలో కొట్టుకొచ్చిన బంగారు గాజులు.. నూటికో కోటికో ఒకరే అతడిలా

America: ఘోర ప్రమాదం.. టేకాఫ్‌ అవుతూనే కుప్పకూలింది