Adilabad: అడవుల జిల్లాలో అద్భుతం.. శతాబ్దాల తర్వాత సాక్షాత్కారమైన భైరం దేవుడి నిజ రూపం.

|

Sep 30, 2023 | 9:32 PM

ఆదిలాబాద్ జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. శతాబ్దాల తర్వాత బైరందేవుడి నిజస్వరూపం సాక్షాత్కారమైంది. నిత్యసిందూరంతో నిండుగా కనిపించే మహా శివుడు వందల ఏళ్ల తర్వాత దర్శనమివ్వడంతో భక్తజనులు పులకించిపోయారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ లోని ఆదివాసీల కొంగు బంగారంగా కొలుచే కదిలే శివుడి మహత్యం ఇది. బేల మండలం సదల్‌పూర్‌లోని బైరాందేవ్,

ఆదిలాబాద్ జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. శతాబ్దాల తర్వాత బైరందేవుడి నిజస్వరూపం సాక్షాత్కారమైంది. నిత్యసిందూరంతో నిండుగా కనిపించే మహా శివుడు వందల ఏళ్ల తర్వాత దర్శనమివ్వడంతో భక్తజనులు పులకించిపోయారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ లోని ఆదివాసీల కొంగు బంగారంగా కొలుచే కదిలే శివుడి మహత్యం ఇది. బేల మండలం సదల్‌పూర్‌లోని బైరాందేవ్, మహాదేవ్ ఆలయాన్ని 11వ శతాబ్దంలో శాతవాహునులు నిర్మించారు. ఇక్కడ కొలవై ఉన్న బైరాందేవ్ దేవుడి నిజస్వరూపం ఉహించుకోవడమే తప్పా.. ఇన్నేళ్లలో దర్శించుకున్న వాళ్లు లేరు. ‌శతాబ్దాల నుండి సిందూరంతో మాత్రమే దర్శనమిచ్చే మహాదేవుడి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ వచ్చారు. తాజాగా ఆ నిజ రూప దర్శనం ఎట్టకేలకు లభించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి క్యూ కట్టారు.

మహాదేవ్ బైరందేవ్ ఆలయంలోని మూర్తిని భక్తులు ప్రతి ఏడాది జనవరి మాసంలో జరిగే జంగి జాతరలో చందనం రాస్తూ వస్తున్నారు. అలా శతాబ్దాల తరబడి రాయడంతో దేవుడి రూపం సిందూరమవ్వగా.. విగ్రహం తలపై భాగం దాదాపుగా మీటరు వరకు ఎత్తు పెరిగిపోయింది. తాజాగా సెప్టెంబర్ 27న సాయంత్రం సమయంలో మీటరు పొడవునన్న ఆ చందనం అంతా ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో బైరాందేవ్ దేవుడి నిజస్వరూపం బయటపడింది. ఇది గమనించిన ఆలయ పూజారి ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు. దీంతో బైరాందేవ్ నిజ రూపం సాక్షాత్కారం అయిందన్న సమాచారం చుట్టూ పక్కలా గ్రామాలకు‌ పాకడంతో భక్తులు పెద్ద ఎత్తున తండోపడాలుగా ఆలయానికి తరలివస్తున్నారు. మహా దేవుడి నిజరూపాన్ని దర్శించుకుని ముగ్దులవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..