పంట రక్షణకు.. పగటి వేషం నిజమైన ఎలుగుబంటి అనుకొని
వానర సేనల ఆకలి దాడులు అన్నదాతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కోతుల బెడద నుండి విముక్తికోసం పడరాని పాట్లు పడుతున్నారు రైతులు. పంటను రక్షించుకోవడం కోసం చివరికి పగటి వేషాలు కూడా వేయాల్సి వస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు ఏకంగా ఎలుగుబంటి వేషం వేసుకొని తన పంటను కోతుల బెడదనుండే కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.
అయితే.. ఈ ఎలుగుబంటి వేషం.. అప్పుడప్పుడు ఆయనకు ఊహించని చిక్కులు తెచ్చిపెడుతోందట. ఈ వేషంలో ఉన్నప్పుడు నిజమైన ఎలుగుబంటే అనుకుని.. స్థానిక రైతులు పలుమార్లు అతడిపై దాడిచేసినా… పంటను కాపాడుకోవటానికి ఈ తిప్పలు తప్పటం లేదని ఆ రైతు వాపోతున్నాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు చిర్రబోయిన శ్రీను. మొత్తం పది ఎకరాల భూమిలో వ్యవసాయం సాగు చేస్తున్నాడు. 8 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. కోతుల బారి నుంచి పంట పొలాన్ని కాపాడుకునేందుకు గులేరు, మైకులు, కర్రలతో తరిమేసి అలసి పోయాడు. కోతుల నుంచి మాత్రం విముక్తి లభించలేదు. దీంతో రైతు శ్రీను కొత్తగా ఆలోచించి ఎలుగుబంటి మాస్కును ఖరీదు చేశాడు. ఎలుగుబంటి వేషంలో ఆ రైతు వెంబడించటం మొదలు పెట్టేసరికి.. కోతుల నుంచి కాస్త విముక్తి లభించింది. ఎలుగుబంటి వేషంతో తన పంటకు కోతుల బెడద నుండి రక్షణ లభించిందని శ్రీను ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఎలుగుబంటి వేషాధారణతో తిరుగుతున్న ఈ రైతుపై అప్పుడప్పుడు దాడులు కూడా తప్పడం లేదట. నిజమైన ఎలుగుబంటి అనుకొని పరిసర ప్రాంత రైతులు కొన్ని సమయాలలో దాడి చేసిన సందర్బాలు కూడా ఉన్నాయని చెబుతున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంస్కరణ బాటలో రైల్వే శాఖప్రయాణికులకు మంచి రోజులు
చెప్పులతో స్కూల్‌కు.. ప్రిన్సిపాల్ దాడిలో విద్యార్థిని
చిన్నారి ప్రాణం తీసిన ఎయిర్ బ్యాగ్
48 ఏళ్ల నాటి కేసులో 71 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
పార్టీ చేసుకున్న యువతీయువకులు.. అర్ధరాత్రి షాకింగ్ సీన్.. చివరకు
