ముస్లిం పెళ్లి శుభలేఖపై హిందూ దేవుళ్లు.. వైరల్‌ అవుతున్న వెడ్డింగ్‌ కార్డు

|

May 28, 2022 | 9:19 AM

మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఓ ముస్లిం యువకుడి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విదిషాలోని ఆనంద్‌పూర్‌కు చెందిన ఇర్షాద్‌, అన్సార్‌ల వివాహం ఆదివారం జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఓ ముస్లిం యువకుడి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విదిషాలోని ఆనంద్‌పూర్‌కు చెందిన ఇర్షాద్‌, అన్సార్‌ల వివాహం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పెళ్లి కార్డుల ద్వారా కుటుంబ సమేతంగా ఐక్యతా సందేశాన్ని అందించారు. అన్సార్, ఇర్షాద్‌లు వివాహ ఆహ్వానపత్రికపైన హిందూ ఆరాధ్య దైవమైన గణేశుడి చిత్రాన్ని, లోపల రాధాకృష్ణుల చిత్రాన్ని ముద్రించారు. ముస్లిం యువకుడి పెళ్లిలో హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రించడంతో.. ఈ పెళ్లి కార్డులు ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారాయి. ఇది కాస్త ఇంటర్‌నెట్‌లో చేరటంతో సోషల్ మీడియా వేదికగా ట్రెండ్‌ అవుతోంది.22 మే 2022న జరిగిన ఈ వివాహ కార్డులు హిందీ భాషలో ముద్రించారు. ఆహ్వాన పత్రికలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వంటి పదాలు వాడారు. ఆనంద్‌పూర్‌లో ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సింహంతో సెల్ఫీ దిగు కానీ !! ఆడుకోవాలనుకుంటే ఇలాగే ఉంటది మరి

ఆ ఇంట్లో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు.. వరికో తెలిస్తే షాకవుతారు !!

Vitamin C: విటమిన్‌ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. అందుకే..

 

Published on: May 28, 2022 09:19 AM