Madhya Pradesh: కారును ఓవర్‌టేక్‌ చేశారని యువకుల్ని చితకబాదిన ప్రభుత్వ అధికారి.

Updated on: Jan 24, 2024 | 6:31 PM

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. బాంధవ్‌గఢ్‌ సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేశారనే కారణంతో ఇద్దరు వ్యక్తులను దారుణంగా కొట్టారు. ఘటనలో ఎస్‌డీఎమ్‌తో పాటు తహసీల్దారుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. బాంధవ్‌గఢ్‌ ఎస్‌డీఎమ్‌ అమిత్‌సింగ్‌, తహసీల్దారు వినోద్‌కుమార్‌తో పాటు మరికొందరు ప్రభుత్వ వాహనంలో వెళుతున్నారు.

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. బాంధవ్‌గఢ్‌ సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేశారనే కారణంతో ఇద్దరు వ్యక్తులను దారుణంగా కొట్టారు. ఘటనలో ఎస్‌డీఎమ్‌తో పాటు తహసీల్దారుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. బాంధవ్‌గఢ్‌ ఎస్‌డీఎమ్‌ అమిత్‌సింగ్‌, తహసీల్దారు వినోద్‌కుమార్‌తో పాటు మరికొందరు ప్రభుత్వ వాహనంలో వెళుతున్నారు. అదే సమయంలో వెనకనుంచి వస్తున్న ఇద్దరు యువకులు ఆ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ యువకులను ఎస్‌డీఎమ్ కర్రతో దారుణంగా కొట్టగా.. ఒకరి తలకు బలమైన గాయమైంది. ప్రస్తుతం బాధితుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌డీఎమ్‌ సహా మరికొందరిపైనా కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ స్పందించారు. ‘‘మధ్యప్రదేశ్‌లో ఇద్దరు యువకులపై అధికారి దాడి చేయడం ఆందోళనకరమనీ సామాన్యులపై అమానవీయంగా ప్రవర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌డీఎమ్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos