గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదు? వీడియో
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం దర్శనం ఇవ్వబోతుంది. బ్లడ్ మూన్ గా కనిపించబోతుంది. ఆదివారం రాత్రి 9 గంటల 52 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1 గంట 28 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయంలో అత్యంత ఎర్రగా మారనున్నాడు చంద్రుడు. 82 నిమిషాల పాటు కనిపించనుంది బ్లడ్ మూన్. ప్రపంచవ్యాప్తంగా 85 శాతం మందికి ఈ చంద్రగ్రహణం దర్శనమిస్తుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం దర్శనమిస్తుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయనే నమ్మకం పూర్వకాలం నుంచి ఉంది.
సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నవారు గృహస్థా శ్రమ నియమాలు పాటించే వారు సాయంత్రం 6 గంటల లోపు భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని చెబుతారు. 6 గంటల తర్వాత నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం చాలా మంచిదంటారు. అలాగే చంద్రగ్రహణం సమయంలో నిద్రపోకూడదని శాస్త్రం చెబుతోంది. చంద్రగ్రహణం రాత్రిపూట సంభవించడంతో ఆ సమయంలో ధ్యానం, జపం వంటివి ఆచరించడం చాలా ఉత్తమమని అంటున్నారు. ఇక ఈ గ్రహణ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాలు చేయడం, పూజా కార్యక్రమాలు ఆచరించడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గర్భిణులు ఈ చంద్రగ్రహణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణానికి ముందు గ్రహణం ముగిసిన తర్వాత స్నానం ఆచరించాలనేది పండితుల సూచన. ఇక చంద్రగ్రహణం సమయంలో ఇంట్లోనే దుర్గాదేవిని పూజించడం, రాహు జపం చేయడం చాలా మంచిది. అలాగే వెండిని దానం చేయడం కూడా మంచి ఫలితాలని ఇస్తుందని చెబుతారు. గ్రహణ సమయంలో అన్నం వండటం కానీ, తినటం కానీ చేయకూడదని చెబుతున్నారు. గ్రహణానికి గంట, రెండు గంటల ముందే భోజనం ముగించాలని అంటారు.
మరిన్ని వీడియోల కోసం :
