అదృష్టం అంటే నీదే బ్రో.. కేవలం రూ. 30 పెట్టుబడితో.. రూ. కోటి సంపాదన

Updated on: Aug 26, 2025 | 12:02 PM

కోట్లు సంపాదించాలి, కోటీశ్వరుడు కావాలనేది.. ప్రతి ఒక్కరికి ఉండే కోరిక. తమ కలను నిజం చేసుకోడానికి కొందరు ఎన్నో కష్టాలు పడి.. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ దాన్ని నిజం చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం అదృష్టంతో కలను నిజం చేసుకుంటారు. ఓ వ్యక్తి 30 రూపాయలు పెట్టి కొన్న లాటరీ ఇప్పుడతన్ని కోటీశ్వరుడిని చేసింది. ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరూ.. ఆయనకు వచ్చిన డబ్బెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

పశ్చిమ బెంగాల్‌ హుగ్లీకి చెందిన సుజిత్ మండల్ కు భార్య, ఇద్దరు పిల్లలు. సుజిత్‌ కూలీ పనులు చేసి కుటుంబాన్ని నడుపుతున్నాడు. సడెన్‌గా అతని భార్య ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు చికిత్స చేయించేందుకు ఎన్నో హస్పిటల్స్ తిరిగి చిరవకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే సుజిత్ తను కూలీ పనులకు వెళ్లి వచ్చే డబ్బులో కొంత డబ్బు పెట్టి లాటరీలు కొనేవాడు. ఏదో ఒక లాటరీ తన జీవితాన్ని మార్చుతుందని బలంగా నమ్మేవాడు. ఈ నమ్మకమే అతన్ని కోటీశ్వరుడిని చేసింది. 30 రూపాయలు పెట్టి కొన్న లాటరీ కోటి రూపాయల మొదటి ప్రైజ్ గెలుచుకుంది. దీంతో అప్పటి వరకు కూలీగా ఉన్న సుజిత్‌ ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. ఆ డబ్బుతో తన భార్య ఆరోగ్యాన్ని బాగు చేయించుకుంటానన్నాడు. సుజిత్‌ కు కోటి రూపాయల లాటరీ వరించడంపై టికెట్ అమ్మకందారుడు మాట్లాడుతూ.. కొన్నేళ్ల నుంచి సుజిత్ తన దగ్గర లాటరీ టికెట్‌ కొంటున్నాడని అన్నాడు. అయితే కొన్న లాటరీని తనతో తీసుకెళ్లకుండా.. నీ దగ్గరే ఉంచుకోమని చెప్పేవాడని అప్పుడు టికెట్‌పై సుచిత్‌ పేరు రాసి బ్యాగులో ఉంచుకునే వాడినని.. ఇప్పుడు సుజిత్ గెలిచిన లాటరీ కూడా తన బ్యాగులో ఉన్నదేనని తెలపడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శభాష్‌ బేబీ.. ఇంటెలిజెంట్‌ అంటే నువ్వే! వీడియో చూసి కారు డోర్‌ ఓపెన్‌ చేసి

6 నెలలకే పుట్టిన చిన్నారి.. బతికించిన హైదరాబాద్ వైద్యులు

పెళ్లిలో డాన్స్‌ చేస్తున్న వరుడు.. చెప్పుతీసిన వధువు.. ట్విస్ట్‌ అదిరిందిగా

కేపీహెచ్‌బీలో భూమికి రికార్డు ధర

వాహనదారులకు అలర్ట్‌.. ఈ రహదారులపై ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ చెల్లదు