టిఫిన్‌ సెంటర్‌లో వేడి వేడిగా వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి!

Updated on: Jun 28, 2026 | 5:53 PM

వరంగల్‌లోని ఓ టిఫిన్ సెంటర్‌లో కొనుగోలు చేసిన వడలో ఉడికిపోయిన బల్లి ముక్కలు కనిపించడం కలకలం రేపింది. వడ తిన్న చిన్నారులు వాంతులు చేయడంతో బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తనిఖీల్లో అపరిశుభ్ర పరిస్థితులు బయటపడటంతో హోటల్‌ను సీజ్ చేసి, రూ.10 వేల జరిమానా విధించారు. ఆహార నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంతగా తనిఖీలు చేస్తున్నా.. కొందరు హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం మాత్రం వీడటంలేదు. తాజాగా వరంగల్ నగరంలో టిఫిన్ ప్రియులు గుండె గుభేల్మనే ఘటన వెలుగు చూసింది. హోటల్‌లో తెచ్చుకున్న ‘వడ’లో ఉడికిపోయిన బల్లి కళేబరాలు బయటపడటం కలకలం రేపింది. వరంగల్ కాశిబుగ్గ ప్రాంతంలో బిట్ల రాజు అనే వ్యక్తి ‘శ్రీ రాజరాజేశ్వర టిఫిన్ సెంటర్’ నిర్వహిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన రాజు అనే కస్టమర్ నిన్న ఉదయం తన పిల్లల కోసం ఇక్కడ రెండు ప్లేట్ల ఇడ్లీ, వడ పార్సల్ తీసుకెళ్లాడు. ఇంటికెళ్లి పిల్లలతో కలిసి తింటుండగా.. ఒక వడ లోపల ఉడికిపోయిన స్థితిలో ఉన్న బల్లి ముక్కలు కనిపించాయి. అప్పటికే ఆ వడ తిన్న పిల్లలు తీవ్ర భయాందోళనతో అక్కడికక్కడే వాంతులు చేసుకున్నారు. బాధితుడు వెంటనే వెంటనే హోటల్‌కు వచ్చి జరిగిన విషయం చెప్పారు. హోటల్‌ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకుండా దురుసుగా మాట్లాడటంతో ఫుడ్‌సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హోటల్‌ను తనిఖీ చేయగా.. సరైన పత్రాలు లేకపోగా… తీవ్ర అపరిశుభ్ర వాతావరణం, మురికి పాత్రలు దర్శనమిచ్చాయి. అధికారులు ఆ హోటల్ యజమానికి రూ.10,000 జరిమానా విధించి, హోటల్‌ను సీజ్ చేశారు. బల్లి పడిన వడతో పాటు హోటల్లోని పిండి, ఇతర ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఇదో వెరైటీ నిరసన!

WhatsApp: వాట్సప్‌లో పెయిడ్‌ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్‌

Follow Us