Viral Video: తెలియక చేసినా, నెటిజన్లను తెగ నవ్విస్తోన్న చిన్నారి.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. వైరల్ వీడియో..

|

Mar 27, 2022 | 5:41 PM

ఈ ఫన్నీ వీడియో @ViralPosts5 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. కేవలం 14 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 21 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Viral Video: తెలియక చేసినా, నెటిజన్లను తెగ నవ్విస్తోన్న చిన్నారి.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. వైరల్ వీడియో..
Funny Video
Follow us on

చిన్న పిల్లలు ఎంత అల్లరి చేస్తారో మనకు తెలిసిందే. ఇక మీఇంట్లో పిల్లలు ఉంటే వారు చేసే అల్లరి పనులు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఏదో ఒక వస్తువు తీసుకుని ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. తినేప్పుడు, తాగేప్పుడు కూడా ఆహారపదార్థాలను ఇంటినిండా పడేస్తుంటారు. అయితే ఎన్ని అల్లరి పనులు చేసినా.. తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రేమిస్తుంటారు. పిల్లలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్(Viral Videos) అవుతుంటాయి. వాటిలో కొన్ని ఎమోషనల్‌గా ఉండే, కొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటాయి. కొన్ని వీడియోలు మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే తాజాగా ఓ ఒక ఫన్నీ వీడియో (Funny Video) నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. ఒక చిన్నారి తెలియకుండా చేసిన చిన్న పని వల్ల ఒక మహిళకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

పెద్దలతోపాటు చిన్న పిల్లలు కూడా ఓ పార్టీలో ఉన్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ సమయంలో, ఒక మహిళ ఖాళీ కుర్చీని చూసి, తను కూర్చేనేందుకు వీలుగా కొంచెం పక్కకు జరిపింది. ఆ తర్వాత ఆ కుర్చీపై కూర్చోబోతుండగా, పక్కనే ఉన్న చిన్న అమ్మాయి ఆ కుర్చీని తన వైపునకు లాక్కుంది. దీంతో ఆ మహిళ వెంటనే నేలపై పడిపోతుంది. దీంతో పక్కన ఉన్నవారంతా ఆశ్యర్యపోయారు. ఇక నెటిజన్లు మాత్రం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

ఈ ఫన్నీ వీడియో @ViralPosts5 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ 14 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 21 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు. ఈవీడియోపై యూజర్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Viral Video: ఇన్‌స్టా రీల్ కోసం పక్కా ప్లాన్.. యాక్షన్‌లో లీనం.. వెనక్కు తిరిగి చూస్తే ఒక్కసారిగా షాక్.. వైరల్ వీడియో

Kacha Badam Song: ట్రెండ్‌ అవుతున్న ‘కచ్చా బాదం’ సాంగ్‌.. ఆ పాట పాడింది ఎవరు..? ఎలా వైరల్ అయ్యింది!