girl playing with frogs: హౌ క్యూట్.. కప్పలకు ముద్దులు పెడుతున్న చిన్నారి..! వైరల్ అవుతున్న వీడియో..

Updated on: Nov 23, 2021 | 9:07 AM

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ మనం ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. వీటిలో ఎక్కువగా జంతువులు, చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే చిన్నపిల్లల ఆటలు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. అంతేకాదు...


సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ మనం ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. వీటిలో ఎక్కువగా జంతువులు, చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే చిన్నపిల్లల ఆటలు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. అంతేకాదు కల్మషం లేని ఆ చిన్నారులను చూడగానే ఎంతో ఆనందం కలుగుతుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.
లక్షల మంది వీక్షిస్తున్న ఈ వీడియోనూ మీరూ చూసేయండి.

మీరు కప్పను ఎప్పుడైనా ముట్టుకున్నారా…ముట్టుకుని ఉండరు కదా… కానీ ఈ వీడియోలో ఓ చిన్నారి కప్పలకు తెగ ముద్దులు పెట్టేస్తోంది. వాటిని హత్తుకుంటోంది కూడా . కప్పలంటే ఆ చిన్నారికి ఎంతో ఇష్టమట. ఈ పాప పేరు లిల్లీ. టిక్‌టాక్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చిన్నారి చాలా ఫేమస్‌. అంతేకాదు ఈ చిన్నారికి లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె పేరెంట్స్… తరచూ పాప వీడియోలని సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజా వీడియో “ఇది తల్లి కప్ప… ఇది పిల్ల కప్ప” అని ఆ పాపకు ఆమె తల్లి… 2 కప్పలను ఇచ్చింది. వాటితో ఎంతో సంతోషంగా ఆడుకుంటోంది లిల్లీ. ప్రస్తుతం ఈ వీడియోని చూస్తున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మనం మన పిల్లలకు ప్రకృతిని పరిచయం చెయ్యాలి. మన చుట్టూ ఉన్న ప్రాణుల పట్ల వారికి జాలి, దయ కలిగేలా నేర్పాలి. మనం ఈ భూమిపై ఉన్న ఇతర జీవులపై ఆధారపడి జీవిస్తున్నామనే నిజాన్ని పిల్లలకు తెలిసేలా చెప్పాలి” అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 23, 2021 08:57 AM