Little girl: ఈ మాత్రం సంస్కారం ఉంటే.. ఏ అత్త అయినా కరిగిపోవాల్సిందే.. ట్రెండ్ అవుతున్న వీడియో.

|

Feb 24, 2023 | 9:07 AM

చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను చూడడానికి అందరూ ఇష్టపడతారు. వారు తెలిసీ తెలియక చేసే పనులు మనల్ని ఎంతగానో నవ్విస్తాయి.తాజాగా ఓ చిన్నారి

చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను చూడడానికి అందరూ ఇష్టపడతారు. వారు తెలిసీ తెలియక చేసే పనులు మనల్ని ఎంతగానో నవ్విస్తాయి.తాజాగా ఓ చిన్నారి తెలిసీ తెలియక చేసిన పని నెటిజన్లను తెగ నవ్విస్తోంది. సాధారణంగా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు పెద్దలపట్ల మర్యాదగా నడుచుకోవడం, వారికి పాద నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవడం అలవాటుచేస్తారు. ఇదిలా ఉంటే ఓ చిన్నారి బాలిక షాపింగ్‌ మాల్‌కి వెళ్లింది. అక్కడ డిస్‌ప్లేలో పెట్టిన ఓ బొమ్మను చూసి తను ఏమనుకుందో ఏమో కానీ వెంటనే వెళ్లి నన్ను ఆశీర్వదించు అన్నట్టుగా ఆ బొమ్మ పాదాలకు నమస్కరించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. బొమ్మ పాదాలను తాకి కళ్లకు అద్దుకుంటున్న ఆ చిన్నారి సంస్కారాన్ని చూసిన నెటిజన్లు మురిసిపోవడమే కాదు, నవ్వే ఓపిక లేదంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు ‘ఇంతటి సంస్కారవంతురాలైన చిన్నారిని ఎక్కడైనా చూశారా..?’ అనే కాప్షన్‌ జోడించారు. కాగా ఈ వీడియోను ఇప్పటికే 89 లక్షలమంది వీక్షించగా, 3 లక్షల 42 వేలమంది లైక్‌ చేశారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘అత్తారింటికి వెళ్లేందుకు ప్రాక్టీస్’ అని కొందరు, ఈ మాత్రం సంస్కారం ఉంటే అత్తాకోడళ్లకు గొడవలే ఉండవ’ని మరికొందరు, ‘నాకు ఈ అమ్మాయే కొడలిగా కావాలి’ అని ఇంకొందరు అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..