Boy Cooking Video: ఈ బుడ్డోడి కుకింగ్ స్కిల్స్ అదుర్స్.. ప్రొఫెషనల్ చెఫ్‌ని మించి.. నలభీములకు సరిసాటి..
పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి వాటిలో వంటలను తయారు చేసేవారిని సర్వసాధారంగా నలుడు, భీముడితో పోలుస్తాం.. ఇక ఇళ్లలో అయితే ఎక్కువ శాతం మహిళలే వంటలు చేస్తారు. బ్యాచిలర్స్ కూడా అప్పుడప్పుడూ చేతులు కాల్చుకుంటారు అనుకోండి... కానీ ఇక్కడ ఓ బుడ్డోడు తల్లి పర్యవేక్షణలో ఫ్రైడ్ రైస్...
పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి వాటిలో వంటలను తయారు చేసేవారిని సర్వసాధారంగా నలుడు, భీముడితో పోలుస్తాం.. ఇక ఇళ్లలో అయితే ఎక్కువ శాతం మహిళలే వంటలు చేస్తారు. బ్యాచిలర్స్ కూడా అప్పుడప్పుడూ చేతులు కాల్చుకుంటారు అనుకోండి… కానీ ఇక్కడ ఓ బుడ్డోడు తల్లి పర్యవేక్షణలో ఫ్రైడ్ రైస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఆ పసిపిల్లవాడి వంట నైపుణ్యానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. కిచెన్‌లో ఓ చిన్నారి ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాడు. వంట చేసే సమయంలో ఓ చిన్న సైజ్ డెమో కూడా ఇచ్చారు. ఈ చిన్నారి చెఫ్ అబీర్‌గా తెలుస్తోంది. ఈ వీడియో అతని తల్లి సోనికా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్షల మంది ఈ వీడియోను వీక్షిస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. అబీర్ ఒక స్టూల్ పై నిలబడి ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాడు. అంతేకాదు ఒక చెఫ్ లాగా తయారీ విధానాన్ని వివరిస్తున్నాడు కూడా. అతను మొదట కూరగాయలను వేయించి.. అనంతరం ఒక గిన్నె తీసుకుని అందులో కోడి గుడ్లు పగలగొట్టి.. వాటిని గిలకొట్టి.. అపుడు వేయించిన కూరగాయల్లో వేసి.. ఫ్రైడ్ రైస్ తయారు చేశాడు. అనంతరం తాను తయారు చేసిన ఫ్రైడ్ రైస్ ను తానే తింటూ ఆస్వాదించాడు. ఈ వీడియోకి “ఈరోజు ఫ్రైడ్ రైస్ చేద్దాం! వంట చేయడం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన గొప్ప నైపుణ్యం అని నేను భావిస్తున్నాను. అబిర్ ఈరోజు వంట చేయడాన్ని ఆనందిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను! అతనికి ఖచ్చితంగా నా కంటే ఎక్కువ తెలుసు ” అంటూ క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు బాలుడు తల్లి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..