Cute Video: ‘ఆదర్శపుత్రుడు’.. తండ్రి కష్టంలో భాగం పంచుకుంటున్న బుడతడు..
ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. సోషల్ మీడియాలోని నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న...
ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. సోషల్ మీడియాలోని నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న ఈ క్యూట్ వీడియోను చూస్తే ‘వావ్ సో క్యూట్’ అని అనకుండా ఉండలేరు. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఉడికిన బంగాళదుంపలపై తోలు తీస్తుంటాడు. అయితే కెమెరా ఫోకస్ మొత్తం ఆ వ్యక్తి పక్కనే ఉన్న అతని బేబీ బాయ్ మీద ఉంది. ఈక్రమంలో ఆ చిన్నారి.. తండ్రి వొలిచిన అక్కడ పెట్టిన బంగాళదుంపలను మెదుపుతూ పిండి పిండి చేస్తున్నాడు. తన తండ్రికి సాయం చేసేందుకు ఎంతో బాధ్యతగా బంగాళదుంపలను పిండి చేస్తున్న ఆ చిన్నారిని చూసిన నెటిజన్లు ‘ఆ క్యూట్ చెఫ్ మాకు కావాలి’ అని, ‘ఆదర్శపుత్రుడు’ అని కామెంట్ చేస్తున్నారు. endukandi అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోను ఇప్పటికే 90 లక్షలమంది వీక్షించారు. 7 లక్షల 8 వేల మంది లైక్ చేశారు. ఈ క్రమంలోనే నెటిజన్లు కామెంట్లు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ ‘ఇలాంటి క్యూట్ చెఫ్‌ను మొదటి సారి చూస్తున్నా’ అని కామెంట్ చేయగా, ‘ఉన్న వనరులను ఉపయోగించుకోవడం అంటే ఇదే’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!