గర్భిణీ శవాన్ని ఊర్లోకి రాకుండా అడ్డుకున్న గ్రామ పెద్దలు.. ఎందుకంటే

Updated on: Dec 21, 2025 | 3:12 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లింగగూడెంలో దారుణం చోటుచేసుకుంది. గర్భిణీ లలిత మృతదేహాన్ని మూఢనమ్మకాల కారణంగా గ్రామంలోకి రానీయలేదు. గ్రామానికి కీడు వస్తుందని గ్రామస్తులు అడ్డుకున్నారు. చేసేదేమీ లేక కుటుంబసభ్యులు గ్రామం బయటే చలిలో అంత్యక్రియలు నిర్వహించారు. టెక్నాలజీ యుగంలోనూ మానవత్వం మంటగలిసిన ఘటన ఇది.

టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలతో మనుషులు మానవత్వాన్నే మర్చిపోతున్నారు. గర్భిణీ మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తే గ్రామానికి కీడు సోకుతుందనే మూఢనమ్మకంతో గ్రామపెద్దలు, గ్రామస్తులు ఆ డెడ్ బాడీని గ్రామంలోకి తీసుకురాకుండా అడ్డుకున్నారు. దాంతో మహిళ మృతదేహానికి ఊరి బయటే అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లింగగూడెంలో ఈ దారుణ ఘటన జరిగింది. బొమ్మెర లలిత అనే గర్భిణీ అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 17న లలిత మృతి చెందింది. అయితే, లలిత శవాన్ని లింగగూడెంకు తీసుకొస్తుండగా కొంతమంది అడ్డుకున్నారు. గ్రామానికి కీడు సోకుతుందని గ్రామంలోకి రానివ్వమన్నారు. మృతురాలి బంధువులు చేసేది లేక లింగగూడెం ఊరు బయటనే చలిలోనే వణుకుతూ అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి గ్రామ పెద్దలను ఒప్పించలేక, రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపారు. లలితకు లింగగూడెంలో సొంత ఇల్లు ఉంది. భర్త ఉన్నాడు. ఆమె అనారోగ్యంతో చనిపోతే సానుభూతి చూపించాల్సిన గ్రామస్తులు, దుఃఖ సాగరంలో ఉన్న మృతురాలి బంధువులను ఇబ్బందులకు గురి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు.. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో

అండమాన్‌ నికోబార్‌ దీవులకు.. పేర్లు పెట్టే ఛాన్స్‌

ఏపీలో కేరళ తరహా టూరిజం.. లగ్జరీ బోట్లలో లాహిరి లాహిరి లాహిరిలో

డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ

ఎంత పెద్ద నేరం జరిగినా పోలీసులకి చెప్పరు !! ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం అమలు