Hyderabad: 400 ఏళ్ల కుతుబ్‌షాహీ మసీద్‌పై పిడుగు.. కుప్పకూలిన మసీదు భాగం.

|

Aug 02, 2023 | 10:56 AM

హైదరాబాద్‌ను భారీవర్షాలు వణికిస్తున్నాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో నానా యాతనా పడుతున్నారు నగర ప్రజలు. అంతేకాకుండా పలుచోట్ల పిడుగులు పడటంతో ఇళ్లలోని ఫ్రిజ్‌లు, ఏసీలు తదితర ఎలక్ట్రికల్‌ వస్తువులు కాలిపోయాయి. అంతేకాదు 400 ఏళ్ల చరిత్ర కలిగిన కుతుబ్‌షాహీ మసీద్‌కూడా పిడుగు పడి గోపురం కూలిపోయింది.

హైదరాబాద్‌ను భారీవర్షాలు వణికిస్తున్నాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో నానా యాతనా పడుతున్నారు నగర ప్రజలు. అంతేకాకుండా పలుచోట్ల పిడుగులు పడటంతో ఇళ్లలోని ఫ్రిజ్‌లు, ఏసీలు తదితర ఎలక్ట్రికల్‌ వస్తువులు కాలిపోయాయి. అంతేకాదు 400 ఏళ్ల చరిత్ర కలిగిన కుతుబ్‌షాహీ మసీద్‌కూడా పిడుగు పడి గోపురం కూలిపోయింది. ఉరుములుమెరుపులతో కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో వందల ఏళ్లనుంచి చెక్కుచెదరకుండా నిలిచిన కుతుబ్‌షాహీ మసీదు పిడుగుపాటుకు గురైంది. దాంతో మసీదు గోపురం కూలిపోయింది. మసీదు మొత్తం పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్లు ఏర్పడటంతో ఈ మసీదు ప్రమాదకర పరిస్థితిలో పడింది. మరోవైపు ఉరుముల ధాటికి యాకత్‌పురాలో ఓ పురాతన భవనం కుప్పకూలిపోయింది. నాంపల్లి యుసుఫిన్‌ దర్గాలో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 02, 2023 08:32 AM