పైప్‌లైన్ దెబ్బతింది.. వేల బ్యారెళ్ల చమురు ఎడారిపాలైంది !!
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు లిబియాలోని చమురు కంపెనీల పరిస్థితి తయారైంది.
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు లిబియాలోని చమురు కంపెనీల పరిస్థితి తయారైంది. ఎంతో కష్టపడి తయారు చేసిన వేల బారెళ్ల చమురు ఎడారి పాలైంది. సరీర్ చమురు క్షేత్రాన్ని మధ్యధరా సముద్రంలో ఉన్న టోబ్రూక్ టెర్మినల్‌కు కలిపే భూగర్భ పైపులైన్ దెబ్బతింది. దీంతో భారీ ఎత్తున చమురు మట్టిలో కలిసిపోయింది. ఎర్ర రంగులో ఉండే ఎడారి ప్రాంతం చమురు లీకైన ప్రాంతాల్లో నల్లగా మారిపోయింది. ఇప్పటికే చమురు సంక్షోభంతో అల్లాడుతున్న లిబియాలోని ఆయిల్ సంస్థలు ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైపు లీకేజ్ కారణంగా 22వేల బ్యారెళ్ల చమురును నష్టపోయినట్లు పైపులైన్ ను నిర్వహిస్తున్న అరేబియన్ గల్ఫ్ ఆయిల్ కంపెనీ అంచనా వేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: పాములే అతడి నేస్తాలు.. నిద్రపోయినా వాటితో కలిసే !!
భారీ లోడుతో దూసుకెళ్తోన్న ట్రక్కు వెనకే వేగంగా వెళ్తోన్న బైక్.. కట్ చేస్తే.. మైండ్ బ్లాంక్
Mount Etna: భయంకరంగా లావా విరజిమ్ముతున్నా వెనకడుగు వేయలేదు..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

