Andhra: కొబ్బరి చెట్టుపై ఉంది కోతి అనుకునేరు – ఏంటో తెలిస్తే వణికిపోతారు

Edited By: Ram Naramaneni

Updated on: Jun 27, 2025 | 1:45 PM

అడవుల్లో నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ చిరుతపులి .. కర్నూలు జిల్లా కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామంలో చిరుతపులి కొబ్బరి చెట్టు ఎక్కింది.. దీంతో జనం అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంలో చిరుతపులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు .

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. తిప్పలదొడ్డి గ్రామంలో చిరుత పులి కనిపించడంతో స్థానికులను భయభ్రాంతులకు గురయ్యారు. చిరుత పులి కొబ్బరి చెట్టు పైకి ఎక్కి కనిపించడంతో.. గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. జనావాస ప్రాంతానికి చిరుత పులి రావడంతో గ్రామస్థులు భీతిల్లారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగా చిరుత పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. కాగా చిరుతను రెచ్చగొట్టేలా ఎలాంటి పనులకు పూనుకోవద్దని.. అటవీ శాఖ సిబ్బంది గ్రామస్థులను సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: Jun 27, 2025 01:38 PM