అయ్యబాబోయ్‌.. ఎంత పెద్ద మొసలో !! 14 అడుగుల పొడవు, 364 కేజీల బరువు

|

Sep 04, 2023 | 9:12 PM

మనుషుల్లో అతి బరువైన, పొడవైన మనుషులు ఉన్నట్టే జంతువుల్లోనూ సాధారణ సైజు ను మించి పెరుగుతుంటాయి. అడపాదడపా ఇవి సరీసృపాల్లో కనిపిస్తుంటాయి. అనకొండ పాముల్లో 35 అడుగుల పొడవైన పెద్ద అనకొండలు కూడా ఉన్నాయంటారు. అలాంటివి మనం సినిమాల్లో చూస్తుంటాంం. కానీ అమెరికాలోని మిసిసిపీలో ఓ అతి పెద్ద మొసలి దొరికింది. ఈ భారీ మొసలికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

మనుషుల్లో అతి బరువైన, పొడవైన మనుషులు ఉన్నట్టే జంతువుల్లోనూ సాధారణ సైజు ను మించి పెరుగుతుంటాయి. అడపాదడపా ఇవి సరీసృపాల్లో కనిపిస్తుంటాయి. అనకొండ పాముల్లో 35 అడుగుల పొడవైన పెద్ద అనకొండలు కూడా ఉన్నాయంటారు. అలాంటివి మనం సినిమాల్లో చూస్తుంటాంం. కానీ అమెరికాలోని మిసిసిపీలో ఓ అతి పెద్ద మొసలి దొరికింది. ఈ భారీ మొసలికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. చూడటానికి డైనోసార్‌లా భయంకరంగా ఉన్న ఈ మొసలిని వేటగాళ్లు నానా తిప్పలూ పడి పట్టుకున్నారు. మిసిసిపీ రాష్ట్రంలో ఇంత పెద్ద మొసలి దొరకడం ఇదే తొలిసారి. 14 అడుగుల 3 అంగులాల పొడవు, 364 కేజీల బరువు ఉన్న ఈ భారీ మొసలి ఆగస్టు 26న వేటగాళ్లకు కనిపించింది. కానీ దానిని వారు చంపేశారు. ఏకంగా ఏడురోజులు కష్టపడి మరీ దాని ఉసురు తీసారు. నదిలో పదిరోజుల పాటు వేట సాగించాక ఓ మడుగులో ఇది కనిపించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సుప్రీంకోర్టులో లాయర్‌గా తెలుగు హీరోయిన్‌..

బ్యాంకుపై దొంగ ప్రశంసలు.. ఎందుకంటే ??

గుడ్‌న్యూస్ !! రూ.99 వేలకే ఎలక్ట్రిక్ కారు

ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా ?? అయితే లైట్ తీస్కోండి

రాజస్థాన్‌లో అమానవీయ ఘటన.. యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త,