Lady Thieves: కిలాడీ లేడీలు.. బంగారం షాపులే టార్గెట్‌.. చివరిలో ఊహించని షాక్..!

Updated on: Oct 13, 2023 | 4:38 PM

శ్రీకాకుళం జిల్లాలో కిలాడీ లేడీలు రెచ్చిపోయారు. బంగారం షాపులే టార్గెట్‌గా వీరు మోసాలకు తెరలేపారు. పాత బంగారం ఇచ్చి కొత్త బంగారు నగలు కొంటామంటూ బంగారం వర్తకులకు గాలమేశారు. గోల్డ్ షాపులకు వెళ్లి తమకు కావాల్సిన నగలు సెలెక్ట్‌ చేసుకొని.. వాటికి బదులుగా పాత నకిలీ నగలు ఇచ్చి వ్యాపారులను మోసం చేస్తున్నారు. ఎట్టకేలకు వీరి బండారం బయటపడి పోలీసుకు చిక్కారు.

శ్రీకాకుళం జిల్లాలో కిలాడీ లేడీలు రెచ్చిపోయారు. బంగారం షాపులే టార్గెట్‌గా వీరు మోసాలకు తెరలేపారు. పాత బంగారం ఇచ్చి కొత్త బంగారు నగలు కొంటామంటూ బంగారం వర్తకులకు గాలమేశారు. గోల్డ్ షాపులకు వెళ్లి తమకు కావాల్సిన నగలు సెలెక్ట్‌ చేసుకొని.. వాటికి బదులుగా పాత నకిలీ నగలు ఇచ్చి వ్యాపారులను మోసం చేస్తున్నారు. ఎట్టకేలకు వీరి బండారం బయటపడి పోలీసుకు చిక్కారు. ఈ కిలాడీ లేడీలు షాపులోకి ఎంట్రీ ఇవ్వగానే అక్కడి సిబ్బందితో మాటలు కలుపుతారు. ఎంతో పరిచయమున్నవారిలా సిబ్బంది యోగక్షేమాలు అడుగుతారు. షాపు యజమాని క్షేమంగా ఉన్నారా అంటూ పలకరిస్తారు. ఆ తర్వాత వారి ప్లాన్‌ అమలు చేస్తారు. ముందుగా నగలు సెలెక్ట్‌ చేసుకుని, తమ వద్ద ఉన్న పాత ఆభరణాలు ఇచ్చి వాటి విలువకు సరిపడా కొత్త ఆభరణాలు తీసుకుంటామని అంటారు. షాపు వారికి టెస్టింగ్ కోసం మొదట అసలైన బంగారు ఆభరణాలే ఇస్తారు. తూకం వేసి, టెస్టింగ్ అయ్యి దాని విలువ కట్టాక అసలు డ్రామా మొదలవుతుంది. షాపు లోకి వచ్చేటప్పుడే అసలు బoగారు ఆభరణాలతో పాటు వాటినే పోలిఉన్న నకిలీ ఆభరణాలను తీసుకువస్తారు. తామిచ్చిన పాత బంగారు ఆభరణాల టెస్టింగ్ అయ్యాక తమ పాత బంగారు నగలకు కాస్త రేటు పెంచమని బేరమాడుతారు. రేటు ఎక్కువ ఇవ్వకపోతే పాత బంగారం ఇవ్వలేమని చెప్పి వారిచ్చిన నగలు వెనక్కి తీసుకొని హ్యాండ్ బ్యాగులో వేసుకుంటారు. ఇంతలోనే మనసు మార్చుకొని సరే మీరు కట్టిన రేటుకే పాత బంగారం తీసుకొని కొత్త నగలు ఇవ్వండి అంటూ తమ హ్యాండ్ బ్యాగ్ లో అప్పటికే ఉంచుకున్న నకిలీ బంగారం ఆభరణాలు ఇస్తారు. పని అవ్వగానే షాపు నుండి నెమ్మదిగా జారుకుంటారు. ఈ నెల 4 న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం లోని ఓ జ్యూయలరి షాప్ లో ఇదే తరహా మోసం చేసేందుకు వెళ్ళారు మహిళలు. తమ చేతి వాటం ప్రదర్శించేందుకు యత్నించగా అప్పటికే సిబ్బంది వాట్సాప్ లలో వచ్చిన వీడియో ఆధారంగా వారిని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారి ఆట కట్టించారు. నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతోన్న ఈ ముఠా తమిళ నాడు రాష్ట్రంలోని శేలంకి చెందిన వారిగా పోలిసుల దర్యాప్తులో తేలింది. ఈ మోసాలలో ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు జెంట్స్ కూడా ఉన్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. మహిళలు షాప్ లోకి వెళ్ళేటప్పుడు ఇద్దరు జెంట్స్ షాపు బయటే ఉంటూ పరిస్థితిని గమనిస్తూ ఉంటారని సీసీ కెమెరాల ఆధారంగా గ్రహించారు. పరారైనవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..