బంగారం కొనాలమ్మా… కొట్టేస్తే రాదు…

|

Jan 09, 2024 | 9:53 PM

బంగారం రేటు రోజు రోజుకీ పెరిగిపోతోంది. అందుకే కేటుగాళ్లు బంగారంపైన కన్నేశారు. ఈజీమనీకి అలవాటు పడిన కొందరు యువతీ యువకులు బంగారం దొంగతానాలకు పాల్పడుతున్నారు. చెయిన్‌ స్నాచింగ్‌లతో వర్కవుట్ కావట్లేదని ఏకంగా బంగారం షాపులనే టార్గెట్‌ చేసుకుంటున్నారు. నగలు కొనడానికి వెళ్లినట్టుగా వెళ్లి సేల్స్‌మెన్‌ను మాటల్లో పెట్టి బంగారం కొట్టేస్తున్నారు. కానీ చుట్టూ ఉండే కెమెరాల కళ్లు కప్పలేరుగా..అప్పటికి తప్పించుకునా... ఆనక సీసీ పుటేజ్‌ ఆధారంగా కిలాడీల ఆటకట్టిస్తున్నారు పోలీసులు.

బంగారం రేటు రోజు రోజుకీ పెరిగిపోతోంది. అందుకే కేటుగాళ్లు బంగారంపైన కన్నేశారు. ఈజీమనీకి అలవాటు పడిన కొందరు యువతీ యువకులు బంగారం దొంగతానాలకు పాల్పడుతున్నారు. చెయిన్‌ స్నాచింగ్‌లతో వర్కవుట్ కావట్లేదని ఏకంగా బంగారం షాపులనే టార్గెట్‌ చేసుకుంటున్నారు. నగలు కొనడానికి వెళ్లినట్టుగా వెళ్లి సేల్స్‌మెన్‌ను మాటల్లో పెట్టి బంగారం కొట్టేస్తున్నారు. కానీ చుట్టూ ఉండే కెమెరాల కళ్లు కప్పలేరుగా..అప్పటికి తప్పించుకునా… ఆనక సీసీ పుటేజ్‌ ఆధారంగా కిలాడీల ఆటకట్టిస్తున్నారు పోలీసులు. తాజాగా రాచకొండ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమి అనే యువతి గోల్డ్ షాపులను టార్గెట్‌గా చేసుకొని నగలు కొట్టేస్తోంది. హైదరాబాద్ మీర్పేట్ లోని ఓ బంగారం షాప్ కు వెళ్ళింది గౌతమి. సేల్స్ మ్యాన్‌ ను రకరకాల గొలుసులను చూపించాలని కోరింది. సేల్స్ మ్యాన్‌ తమవద్ద మోడల్స్‌ అన్నీ చూపిస్తున్నాడు. ఈ క్రమంలో అతను పక్కకు వెళ్లగానే తన వెంట తెచ్చిన నకిలీ బంగారు గొలుసులను అక్కడ పెట్టి అసలు బంగారు గొలుసులను కొట్టేసింది. ఇదీ ఇమె చోరీ స్టయిల్‌. ఎప్పటిలాగే ఇక్కడ కూడా అదే ప్లాన్ అమలు చేసింది. దాదాపు అరగంటసేపు డిజైన్స్ అన్ని చూశాక తనకు ఏ డిజైన్ నచ్చలేదని చెప్పి కొట్టేసిన గొలుసులతో బయటపడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

4వేల డాల‌ర్లు న‌మిలేసిన‌ శున‌కం..

ఆ రోజు 16 సార్లు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వాళ్లకు మాత్రమే

రామపాదుకలతో అయోధ్యకు పాదయాత్ర

UPI ద్వారా ఒకరికి బదులు మరొకరికి డబ్బు పంపితే ఏం చెయ్యాలి ??

 

Published on: Jan 09, 2024 09:47 PM