8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ.. ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో సృజనాత్మకత

Updated on: Jan 26, 2026 | 1:27 PM

కర్నూలు జిల్లా ఆదోని విద్యార్థి ఈరన్న, తన డ్రాయింగ్ టీచర్ ఎన్. కీర ప్రోత్సాహంతో రావి ఆకుపై నేతాజీ చిత్రాన్ని అద్భుతంగా గీశాడు. ఉపాధ్యాయులు విద్యార్థుల సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే వారి ప్రతిభ ఎలా వెలికి వస్తుందో ఈ ఘటన నిరూపించింది. ఈరన్న కళాకృతి పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

పిల్లలలో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఎంతో ప్రతిభను సాధిస్తారు. అందుకు ఉదాహరణే ఈ బాలుడు. విద్యార్ధుల అభివృద్ధిలో తల్లిదండ్రులది ఎంత పాత్ర ఉంటుందో.. అంతకన్నా ఎక్కువ ఉపాధ్యాయుల ప్రభావం ఉంటుంది. ఓ టీచర్‌ విద్యార్ధిలోని ఆసక్తిని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించడంతో ఎంతో అరుదైన కళను ఆ విద్యార్ధి నేర్చుకున్నాడు. రావి ఆకుపై స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ చిత్రాన్ని గీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఘటన కర్రూలు జిల్లా ఆదోని పట్టణంలో జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఈరన్న అనే విద్యార్ధి 8వ తరగతి చదువుతున్నాడు. జనవరి 23న స్వతంత్ర సమరయోధుడు నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని రావి ఆకుపై నేతాజి సుభాష్ చంద్రబోస్ ఆకృతిని తయారుచేసి అబ్బురపరిచాడు. పాఠశాల మండల విద్యాధికారి శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఈరన్నను, డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్.కీర ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థి ఈరన్న .. డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ప్రత్యేక శిక్షణతో ఈ చిత్రాన్ని చేశానని, ఈ చిత్రం చేయడానికి 2 గంటల సమయం పట్టిందని తెలిపాడు. అనంతరం డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్. కీర స్పందిస్తూ.. విద్యార్థులలోని సృజనాత్మకతను నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, స్వతంత్ర సమరయోధుల గురించి తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటామని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్

ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం.. ఇలా ఉన్నారేంట్రా

బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. ఆమె తెచ్చిన భారీ సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్‌

మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు

అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..