Watch Video: వీడిన కర్నూలు భోషాణం మిస్టరీ.. ఇనుప బీరువా ఓపన్ దృశ్యాలు

Watch Video: వీడిన కర్నూలు భోషాణం మిస్టరీ.. ఇనుప బీరువా ఓపన్ దృశ్యాలు

Janardhan Veluru

|

Updated on: Apr 04, 2023 | 5:17 PM

కర్నూలు జిల్లా దేవనకొండలో భోషాణం మిస్టరీ వీడిపోయింది. రెండ్రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన భోషాణం చివరికి బద్ధలైంది. సుత్తి, గ్యాస్‌ కట్టర్‌తో భోషాణాన్ని అధికారులు పగలగొట్టించారు.

కర్నూలు జిల్లా దేవనకొండలో భోషాణం మిస్టరీ వీడిపోయింది. రెండ్రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన భోషాణం చివరికి బద్ధలైంది. సుత్తి, గ్యాస్‌ కట్టర్‌తో భోషాణాన్ని అధికారులు పగలగొట్టించారు. అయితే, భోషాణంలో వజ్రవైఢూర్యాలు, బంగారం, రత్నాలు ఉంటాయని భావించిన గ్రామస్తులకు నిరాశే ఎదురైంది. భోషాణం నిండా మట్టి, చెత్తాచెదారం, పాత కాగితాలు తప్ప ఇంకేమీ లేకపోవడంతో ఉసూరుమన్నారు స్థానికులు. రెండ్రోజులపాటు తీవ్ర ఉత్కంఠ రేపింది ఈ భోషాణం. దేవనకొండలో పాత ఇంటిని కూలుస్తుండగా ఈ భోషాణం బయటపడింది. కిలోల కొద్దీ బరువున్న ఈ భోషాణాన్ని ఐదారుగురు లాగితే తప్పా కదల్లేదు. దాంతో, లోపల ఏదో ఉందన్న అనుమానం గ్రామస్తుల్లో కలిగింది. భోషాణంపై రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా లక్ష్మీదేవి రూపు ఉంది. పైన ఒక తాళం, కింద ఒక తాళంతో పకడ్బందీగా ఉంది. దాంతో, వజ్రవైఢూర్యాలు, బంగారం, రత్నాలు ఉంటాయని భావించారా అంతా!. అయితే, పగలగొట్టి చూస్తే అందులో మట్టి తప్ప ఇంకేం లేకపోవడంతో స్థానికులు నిరాశకు గురయ్యారు. భోషాణంలో కొన్ని పాత డాక్యుమెంట్స్‌ దొరికాయి.

Published on: Apr 04, 2023 05:17 PM