అమావాస్య వేళ రంగు మారిన నీరు.. కారణం అదేనట

Updated on: Nov 26, 2025 | 12:38 PM

కర్నూలు జిల్లా కులుమాల గ్రామంలో అమావాస్య నాడు అయ్యప్ప కుంట నీరు నల్లగా మారడం స్థానికుల్లో భయాందోళన నింపింది. చేతబడి, విషప్రయోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూగజీవాలు నీళ్లు తాగలేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయి. అధికారులు స్పందించి నీటి నాణ్యతను పరిశోధించి, పశువులకు తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అమావాస్య వేళ కారు చీకట్లు కమ్ముకుంటాయని తెలుసుకానీ.. నీరు రంగు మారడమేంటని ఆశ్చర్యపోతున్నారు జనాలు. అవును ఆ ఊరిలో నీటికుంటలోని నీరు ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. అదీ అమవాస్య రోజు.. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మూగజీవాలు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. ఇంతకీ ఈ కుంటలో నీరు రంగుమారడం వెనుక కారణమేంటి? అమావాస్య వేళ మూఢ నమ్మకాలతో క్షుద్రపూజలు చేస్తుంటారు. అలాంటి ఘటనలు చాలానే చూశాం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కులుమాల గ్రామంలో అమావాస్యరోజు కుంటలో నీరు నల్లగా మారడంపై ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఎవరైనా చేతబడి చేశారా? లేక విషప్రయోగం చేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పూర్వీకుల కాలం నుంచి ఉన్న అయ్యప్ప కుంటలో నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఆ గ్రామంలోని పశువులకు ఈ కుంటలో నీళ్ళే ఆధారం. అలాంటిది గత అమావాస్య రోజు ఒక్కసారిగా నీళ్లు నల్లగా మారిపోయాయి. పశువులకు నీళ్లు తాగించడానికి వచ్చిన స్థానికులు నీళ్ల రంగు చూసి ఆశ్చర్యపోయారు. పశువులు కూడా ఆ నీళ్లు తాగకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి నీటిని పరిశోధనలకు పంపి చర్యలు చేపట్టాలని, తమ పశువులకు తాగునీటిని అందించాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లైంగిక సామర్థ్యం పెంచుతానని లక్షలు ఖర్చు చేయించి.. చివరికి అనుకున్నది చేసాడు