అప్పు తీర్చమని అడిగినందుకు ఎంత పని చేశావురా ??
కుప్పంలో ఆర్థిక లావాదేవీల వివాదం శ్రీనాథ్ హత్యకు దారితీసింది. అప్పు తిరిగి అడిగినందుకు ప్రభాకర్ తన బంధువైన శ్రీనాథ్‌ను హత్య చేసి ఇంటిలోనే పూడ్చిపెట్టాడు. కర్ణాటకలో అదృశ్యమైన శ్రీనాథ్ కేసు చిత్తూరు జిల్లాలో దారుణంగా తేలింది. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు దారుణంగా హత్య చేసి..ఇంట్లోనే పూడ్చి పెట్టాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మృతుడు శ్రీనాథ్ అక్టోబర్ 27 నుంచి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీలే శ్రీనాథ్ హత్యకు కారణమని భావించిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. శ్రీనాథ్ ను హతమార్చింది అతని బంధువు ప్రభాకర్‌గా గుర్తించారు. కుప్పం మండలం డీకే పల్లికి చెందిన ప్రభాకర్‌కు శ్రీనాథ్ వరుసకు సోదరుడు. బతుకు దెరువు కోసం బెంగళూరుకు వెళ్లి స్థిరపడ్డ శ్రీనాథ్ నుంచి ఏడాది క్రితం ప్రభాకర్ దాదాపు రూ.40 లక్షలు తీసుకున్నాడు. బెంగళూరులోని అక్కిబెలె ప్రాంతంలో స్థిరపడ్డ శ్రీనాథ్ డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రభాకర్‌పై ఒత్తిడి చేశాడు. ఆర్థిక సంబంధమైన విషయాలతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 27న శ్రీనాథ్ అదృశ్యం అయ్యాడు. దీంతో అతని భార్య కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును అత్తిబెలె పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో తన భర్త ఆచూకీ తెలపాలంటూ కర్ణాటక పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ టీం శ్రీనాథ్ మిస్సింగ్ కేసును ఛేదించింది. శ్రీనాథ్, ప్రభాకర్ మధ్య ఫోన్ల సంభాషణలపై దృష్టి పెట్టిన పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. రామకుప్పం మండలం ముద్దనపల్లిలో స్థిరపడ్డ ప్రభాకర్‌ను పోలీసులు అనుమానించారు. గతంలోనూ క్షుద్ర పూజలు, ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్న ప్రభాకర్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో శ్రీనాథ్‌ను తానే హత్య చేసినట్లు ప్రభాకర్ అంగీకరించాడు. కుప్పంలోని తన ఇంటిలో పాతిపెట్టినట్లు ఒప్పుకోవడంతో శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా, లేక మరి ఏదైనా ఇతర అంశాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన ఇస్రోకు క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు.. వచ్చే ఏడాది భారీ టార్గెట్ !!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి సేవా టికెట్లు రిలీజ్ అప్పుడే
