యజమానిని చంపి..బంగారంతో పారిపోయిన వంటమనిషి వీడియో

Updated on: Sep 12, 2025 | 2:45 PM

ఉరుకులు పరుగుల జీవితంలో ఇంట్లో పనులు చేసుకునేందుకు సమయం లేక వంటమనుషులను పెట్టుకుంటారు కొందరు. అలాగే ఇంట్లో ఉండే పెద్దవారిని చూసుకునే వారు లేక కేర్‌ టేకర్‌లను నియమిస్తుంటారు మరికొందరు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. వంటమనుషులను, కేర్‌ టేకర్‌లను నమ్మి పెద్దలను, ఇంటిని వారికి అప్పగించి వెళ్లేవారికి ఈ ఘటన ఒక హెచ్చరిక.

ఎంతో నమ్మకంగా పెట్టుకున్న కేర్‌ టేకర్‌లు, వంట మనుషులు క్రిమినల్స్‌గా మారుతున్నారు. బంగారం, డబ్బు కోసం నిస్సహాయంగా ఉన్న యజమానులను హతమార్చిన ఘటనలు నెట్టింట తరచూ చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్‌ కూకట్‌ పల్లిలో ఇలాంటి దారుణమే జరిగింది. నమ్మకంగా ఇంట్లో పనికి పెట్టుకున్న వంట మనిషే యజమానురాలి పాలిట యముడయ్యాడు. అత్యంత సురక్షితమైనదిగా భావించే గేటెడ్ కమ్యూనిటీలో ఓ మహిళను అతి కిరాతకంగా చంపి, బంగారం, నగదు దోచుకెళ్ళారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపింది. హత్య చేసిన తర్వాత నిందితులు ఏమాత్రం భయం లేకుండా అక్కడే స్నానం చేసి, యజమానురాలి వాహనంపైనే పరారైనట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

తురకపాలెం బాధితుల్లో మెలియాయిడోసిస్‌ లక్షణాలు గుర్తింపు వీడియో

నర్సరీలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూసిన కూలీలకు షాక్ వీడియో

బస్సులో ఫోన్‌ పోగొట్టుకున్నారా.. జాగ్రత్త వీడియో

అలవాటుగా ఇంటి సీలింగ్‌వైపు చూసి వణికిపోయిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?వీడియో