Viral: జాకీల సాయంతో అమ్మవారి ఆలయం ‘లిఫ్టింగ్‌’.! వీడియో వైరల్..

|

Nov 11, 2024 | 12:57 PM

చెన్నై జిల్లా పొన్నేరి సమీపంలోని తిరువేంగిడపురం గ్రామంలో కృష్ణన్‌ మారియమ్మన్‌ ఆలయం ఉంది. ఈ ఆలయంలో వినాయకుడు, ఆంజనేయుడు, దుర్గ, షణ్ముగ, కౌమారి, వైష్ణవి, మహేశ్వరి తదితర దేవతామూర్తులకు ప్రత్యేక సన్నిధులు నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగే పూజలకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఆలయం సమీపంలోని రోడ్డును పునరుద్ధరించే ప్రతిసారి రోడ్డు ఎత్తు పెరుగుతోంది. దీంతో, ఆలయం రోడ్డు కంటే కిందకు వెళ్లింది.

ప్రస్తుతం జాకీల సాయంతో పొన్నేరి పరిసర ప్రాంతాలలో భవనాలను ‘లిఫ్టింగ్‌’ విధానంలో ఎత్తు పెంచే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, ఈ లిఫ్టింగ్‌ విధానం ద్వారా ఆలయం ఎత్తు కూడా పెంచాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఓ ప్రైవేట్‌ సంస్థ సాయంతో జాకీలు ఏర్పాటుచేసి క్రమక్రమంగా లిఫ్ట్‌ చేశారు. 20 రోజుల లిఫ్టింగ్‌లో ఆలయాన్ని దాదాపు మూడడుగుల ఎత్తు లేపారు. మరో రెండు నెలలో ఆలయంలో జీర్ణోద్ధరణ చేపట్టి కుంభాభిషేకం నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు ఆర్‌ఎన్‌ బాలాజి సర్కార్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Nov 11, 2024 12:54 PM