కోనసీమలో ఆకట్టుకుంటున్న గోవా బీచ్..
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్.యానాం వైట్ సాండ్ బీచ్, బ్యాక్ వాటర్స్ తో కలిసి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. 'ఆంధ్రా గోవా'గా ప్రసిద్ధి చెందిన ఈ బీచ్‌లో రెస్టారెంట్, ఓపెన్ ఆడిటోరియం పనులు జరుగుతున్నాయి. రాబోయే సంక్రాంతికి వాటర్ బైక్‌లు, పారాచూట్‌లు వంటి వినోదాలతో పర్యాటకులను ఆకట్టుకునేలా భారీ సంబరాలకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం లో వైట్ సాండ్ బీచ్ అందరిని ఆకట్టుకుంటుంది. సముద్రతీరమంతా వైట్ సాండ్ తో నిండి గ్రీన్ కలర్ లో వాటర్ దర్శనమిస్తూ పర్యాటక ప్రేమికులను కట్టిపడేస్తుంది. ఇప్పుడు ఆ బీచ్‌ను ఆంధ్ర గోవా బీచ్ గా పిలుచుకుంటున్నారు. ఒకపక్క వేల ఎకరాల బ్యాక్ వాటర్ మరోపక్క ఆహ్లాదంగా కనిపించే వైట్ సాండ్‌తో బీచ్ కోనసీమకు కొత్త అందాలు సంతరిస్తున్నాయి. దీంతో ఈ బీచ్‌కు పర్యాటకులకు సంఖ్య పెరుగుతోంది. దీంతో కూటమి ప్రభుత్వం ఎస్.యానాంలో వైట్ సాండ్ బీచ్‌కు ఆంధ్రా గోవాగా పేరు పెట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు మొదలుపెట్టారు. ఈ బీచ్ లో రెస్టారెంట్ తో పాటు ఏకంగా 4,000 మంది పట్టే విధంగా ఓపెన్ ఆడిటోరియం నిర్మాణ పనులు చేపట్టారు స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. గత ఏడాది బీచ్ ను ప్రమోట్ చేసేందుకు నేషనల్ బీచ్ వాలీబాల్ పోటీలు పెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు. అలాగే సంక్రాంతికి బీచ్ సంబరాలు ఏర్పాటుచేసి సినీ మ్యూజికల్ ఆర్కెస్ట్రాలతో రోజుకు లక్ష నుండి రెండు లక్షల మంది బీచ్ కు వచ్చి సంక్రాంతి సంబరాలు చూసే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈసారి సంక్రాంతికి బీచ్ వద్ద రెస్టారెంట్ తో పాటు ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేసి మరింత ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఎస్ యానం ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సంబరాలు జరిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. ఈసారి సంక్రాంతి సంబరాల్లో పర్యాటకులు నాకట్టుకునే విధంగా బ్యాక్ వాటర్ లో వాటర్ బైక్స్ అలాగే బీచ్ లో సాండ్ బైక్ తో పాటు పారాషూట్లు ఏర్పాటు చేసి పర్యాటకులకు మంచి ఆహ్లాద వినోదాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు .
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జస్ట్ ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాస్తే తెల్ల జుట్టు మాయం
దేశంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్.. దిమ్మదిరిగే ఆస్తులకు ఓనర్
Andrea Jeremiah: న్యూడ్ పోస్టర్ కలకలం! హీరోయిన్ వైపే అందరి చూపు…
Varanasi: హమ్మయ్య! తలనొప్పి నుంచి తప్పించుకున్న జక్కన్న
పాత కామిక్ బుక్ ధర అక్షరాల రూ.81 కోట్లు.. ఏ మాత్రం తగ్గనిసూపర్ మ్యాన్ క్రేజ్
