కోనసీమకు విదేశీ అతిథులు 12 వేల కి.మీ దూరం నుంచి …
ఎన్నెన్నో రంగుల విదేశీ పక్షులు.. వేలాదిగా అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా దేశాల నుంచి కోనసీమకు అతిథులుగా వస్తున్నాయి. శీతా కాలం నేపథ్యంలో ఆయా దేశాల్లో తీవ్ర మంచు కురుస్తోంది.ఈనేపథ్యంలో ఆహారం కోసం విదేశీ పక్షులన్నీ 5 వేల కిలోమీటర్లకుపైగా ఎగు రుకుంటూ వలస వచ్చాయి. మార్చి రెండోవారం వరకు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి కోసం తిరిగి ఇవన్నీ ఆయా దేశాలకు వెళ్లనున్నాయి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి దొడ్డవరం మధ్యలంకలో గత కొంతకాలంగా ఐరోపా నుండి వలస వచ్చి దట్టమైన తుమ్మ చెట్లు పై ఆవాసం ఏర్పాటు చేసుకుని గత మూడేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాయి ఓపెన్ బిల్లుడు స్టార్క్ పక్షులు. ఐరోపా ఖండం శీతలంగా ఉండడం వల్ల సంతానోత్పత్తి జరగదని ఉద్దేశంతో ఐరోపా నుండి 12 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉష్ణ ప్రాంతాలైన ఇండియా లాంటి ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తి చేస్తుంటాయి. దట్టమైన తుమ్మ చెట్లపై ఇవి గూళ్లను కట్టుకొని సంతానోత్పత్తి చేస్తాయని దానికి ప్రధాన కారణం. తుమ్మ చెట్లకు ముల్లులు ఉండడంతో జన్మించిన పిల్లలను పాములు బారిన పడకుండా కాపాడుకోవడం కోసం తుమ్మ చెట్లపైనే ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయని స్థానికులు అంటున్నారు. వలసలు వెళ్ళడం అనేది మనుషులు, జంతువులకే కాదు పక్షులకు సహజమే.. కాలంతో పాటు ప్రాణులు మనుగడ కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళుతుంటాయి. వీటిలో పక్షుల వలసలకు ఎల్లలు ఉండవు. ఆకాశంలో ఎగురుకుంటూ కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంటాయి. ఖండాంతర వలసలు మాత్రం కేవలం పక్షులకే సాధ్యం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రికి బెదిరింపు లేఖ.. రూ.35 లక్షలు డిమాండ్ చేసిన కొడుకు
ఖరీదైన కాఫీ..కిలో జస్ట్ రూ.25 లక్షలే
క్యాన్సర్ గెలిచింది.. ఇదే నా చివరి దీపావళి యువకుడి ఎమోషనల్ పోస్ట్
