Kolkata Doctor Murder Case: అభయ డైరీలో చిరిగిన పేజీ.. కోల్‌కతా హత్యాచార ఘటనలో కొత్త కోణం.!
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. పనిచేస్తున్న చోటే అత్యంత పాశవికంగా ఆమెపై అఘాయిత్యం జరిగిన తీరు ప్రతీ హృదయాన్ని మెలిపెడుతోంది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తె డైరీ లో ఓ పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి చెబుతున్నారు.

అమ్మాయి బ్యాగులో ఎప్పుడూ పర్సనల్ డైరీ ఉంటుందనీ దాన్ని తాము ఎప్పుడూ చదవలేదనీ అన్నారు. హాస్పిటల్‌కి వచ్చాక తను రోజూ తమతో అన్ని విషయాలు పంచుకుంటుందనీ ఘటన తర్వాత తన డైరీని చూస్తే అందులో ఓ పేజీ కొంత చిరిగి ఉందనీ దానికి సంబంధించిన ఫొటో తన వద్ద ఉందని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియాకు తెలిపారు. అయితే, అందులో ఏముందనే విషయాన్ని బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు. ఆ విషయాలను బహిరంగంగా చర్చించొద్దని సీబీఐ తమకు సూచించినట్లు తెలిపారు.
మరోవైపు వైద్యురాలి మృతదేహాన్ని తొలిసారి చూసిన ఓ సాక్షి మీడియాతో మాట్లాడారు. సెమినార్ హాల్‌లోని పోడియం వద్ద ఆమె విగతజీవిగా కన్పించిందనీ ఒంటిపై కుర్తా చిందరవందరగా చిరిగిపోయిందనీ ఆ సాక్షి ఓ జాతీయ మీడియాకు వివరించారు. ట్రౌజర్స్ కన్పించలేదనీ మెడ నుంచి మోకాలి వరకు నీలం రంగు బెడ్‌షీట్ కప్పి ఉందనీ ఆమె ల్యాప్‌టాప్, నోట్‌బుక్, సెల్‌ఫోన్, వాటర్‌బాటిల్ పక్కనే ఉన్నాయని అన్నారు. సెమినార్ హాల్‌లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన ఆమె ఒంటరిగా ఉందని గ్రహించి నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.