ఎత్తైన కొండలపై అద్భుతమైన అరకు కాఫీ.. దానిలో అంత మజా ఉందా ??

Updated on: Sep 16, 2023 | 2:02 PM

అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీకి మరోసారి అరుదైన ప్రాధాన్యత దక్కింది. న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమ్మిట్‌లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శనకు అవకాశం రావడమే ఇందుకు కారణం. సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌లో గిరిజన సహకార సంస్థ.. గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన రైతులు పండించిన, ప్రత్యేకమైన, అధిక నాణ్యత ప్రమాణాలు కల్గిన కాఫీని ప్రదర్శించారు.

అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీకి మరోసారి అరుదైన ప్రాధాన్యత దక్కింది. న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమ్మిట్‌లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శనకు అవకాశం రావడమే ఇందుకు కారణం. సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌లో గిరిజన సహకార సంస్థ.. గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన రైతులు పండించిన, ప్రత్యేకమైన, అధిక నాణ్యత ప్రమాణాలు కల్గిన కాఫీని ప్రదర్శించారు. అలాగే జీ-20 దేశాధినేతలకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్లలో కూడా అరకు కాఫీకి చోటు దక్కింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అద్భుతమైన అటవీ ప్రాంతం మన్యం, ఏజెన్సీ లో అరుదైన కాపీ సాగు జరుగుతోంది. పాడేరు, అరకు లాంటి ఎత్తైన కొండల మధ్య ఉన్న వ్యాలీల్లో అత్యంత అరుదైన కొండ జాతి సంప్రదాయ గిరిజన కుటుంబాలు కాఫీ సాగు చేస్తున్నారు. ఈ వ్యాలీ పరిసర ప్రాంతాలలో కాఫీ తోటకు అనుకూలంగా ఉండడం, అక్కడ పండే కాఫీ పంట నుంచి తీసే కాఫీ అద్భుతమైన రంగు, రుచి వాసన ఉండడంతో డిమాండ్ పెరిగింది. ఒకసారి ఈ కాఫీ తాగిన వాళ్ళు మళ్లీ ఆ కాఫీ కోసమే అరకు ప్రాంతాలకు వస్తుండడంతో ఇక్కడ పండుతున్న కాఫీకి ప్రపంచ స్థాయి పేరొచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

10 రోజులు లీవ్‌ అడిగిన ఎంప్లాయ్‌.. 2 నిమిషాల్లో ఓకే చెప్పిన బాస్‌..

వేలానికి ప్రిన్సెస్‌ డయానా స్వెట్టర్‌.. ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా ??

విశాఖ తీరంలో అరుదైన చేప గుర్తింపు.. దీని ప్రత్యేకత ఏంటంటే ??

Mamata Banerjee: చీరకట్టు, స్మార్ట్‌ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్‌..

iPhone 15: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి ??