Ride a bicycle: సాక్స్‌ కావాలా నయనా.. అయితే సైకిలు తొక్కండి.. సైకిలు తొక్కితే సాక్స్‌లు రెడీ.. త్వరపడండి..

|

Apr 07, 2022 | 9:34 AM

సాధార‌ణంగా సైకిల్ తొక్కితే ఫిట్‌గా ఉంటారని చెబుతారు. అందుకే చాలామంది సైకిలింగ్‌ చేస్తుంటారు. కానీ.. ఇక్కడ జపాన్‌కి చెందిన ఓ కంపెనీ కస్టమర్స్‌కి బంపరాఫర్‌ ఇస్తోంది. ఇక్కడ సైకిలింగ్ చేసి తమకు నచ్చిన సాక్స్‌ తీసుకెళ్లండి అంటోంది. ఇదేంటి సైకిల్‌ తొక్కడమేంటి..


సాధార‌ణంగా సైకిల్ తొక్కితే ఫిట్‌గా ఉంటారని చెబుతారు. అందుకే చాలామంది సైకిలింగ్‌ చేస్తుంటారు. కానీ.. ఇక్కడ జపాన్‌కి చెందిన ఓ కంపెనీ కస్టమర్స్‌కి బంపరాఫర్‌ ఇస్తోంది. ఇక్కడ సైకిలింగ్ చేసి తమకు నచ్చిన సాక్స్‌ తీసుకెళ్లండి అంటోంది. ఇదేంటి సైకిల్‌ తొక్కడమేంటి.. సాక్స్‌ తీసుకెళ్లడమేంటి అనుకుంటున్నారా… అసలు విషయం ఏంటంటే… జ‌పాన్‌కు చెందిన సౌకీ సాక్స్ అనే సాక్స్ ఫ్యాక్ట‌రీ ఒక మెషిన్‌ను త‌యారు చేసింది. అది సాక్స్ త‌యారు చేసే మెషిన్. దానికి ఒక సైకిల్‌ను అటాచ్ చేశారు. సైకిల్ ఎక్కి తొక్కితే సాక్స్ త‌యారు అవుతాయి. ఎటువంటి మ్యాన్ ప‌వ‌ర్ అవ‌స‌రం లేకుండా కేవ‌లం సైకిల్ మీద కూర్చొని తొక్కితే చాలు.. మెషిన్ లోప‌లి నుంచి సాక్స్ బ‌య‌టికి వ‌స్తాయి. విచిత్రంగా ఉంది క‌దా.ఈ మెషిన్ పేరు చ‌రిక్స్. 2017లో దీన్ని జ‌పాన్‌లోని నారా ప్రెఫెక్ష‌ర్ అనే ఏరియాలో ఏర్పాటు చేశారు. ఆ ఫ్యాక్ట‌రీకి వెళ్లి న‌చ్చిన రంగుల్లో, న‌చ్చిన సైజ్‌లో క‌స్ట‌మ‌ర్లే సాక్సుల‌ను త‌యారు చేసుకోవ‌చ్చన్నమాట. ఎవరైనా సాక్స్‌లు కొనుక్కోవాలి అనుకుంటే నేరుగా అక్కడకి వెళ్లి సైకిల్ ఎక్కి తొక్కేయ‌డ‌మే. ఓ 10 నిమిషాల పాటు తొక్కితే చాలు… మీకు నచ్చిన సాక్స్ రెడీ అయిపోతాయి. వాటికి చివ‌ర్లో కుట్లేసి క‌స్ట‌మ‌ర్ల‌కు అక్క‌డిక‌క్క‌డే అందిస్తారు. ఆన్‌లైన్‌లో కూడా ఈ సాక్స్‌ల‌ను ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు. సైజ్‌, క‌ల‌ర్ లాంటి ఆప్ష‌న్స్ సెలెక్ట్ చేసుకుంటే కంపెనీ వాళ్లే క‌స్ట‌మ‌ర్ల కోసం సైకిల్ తొక్కి సాక్స్‌ల‌ను త‌యారు చేసి ఇంటికి డెలివ‌రీ చేస్తారు. ఇంత‌కీ.. ఆ సైకిల్‌ను ఎలా తొక్కాలి.. ఎలా సాక్సుల‌ను త‌యార‌వుతాయి.. ఇంత‌కీ ఆ మెషిన్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియోను చూసేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Dog singing Video: వావ్ వాట్ ఏ సింగింగ్ రెయ్.. పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్‌..

అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్‌ జాక్సన్‌ స్టెప్‌ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్‌…