నడిరోడ్డు పై గిరినాగు..పడగ విప్పి.. బుసలు కొట్టి..వీడియో

Updated on: May 01, 2025 | 4:36 PM

రాత్రి తొమ్మిది గంటల సమయం.. అంతా నిర్మానుష్యంగా ఉంది.. చిమ్మ చీకటిలో వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఆ సమయంలో విజయనగరం జిల్లా వేపాడ మండలం అరిగివాని గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పనుల మీద బయటకు వెళ్లి గ్రామంలోకి తిరిగొస్తున్న వారికి రోడ్డుపైనే ఓ పదహారు అడుగుల గిరినాగు పడగవిప్పి రెచ్చిపోయి బుసలు కొట్టడం కనిపించింది. నలుపు, తెలుపు రంగుతో భయానకంగా ఉన్న ఆ పామును చూసి ఒక్కసారిగా షాకయ్యారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లలేక అదే స్పాట్ లో నిలబడిపోయారు.

పగలంతా పనులు చేసుకుని త్వరగా ఇంటికి వెళ్దామనుకున్న గ్రామస్తులకు గిరి నాగు బ్రేక్ ఇచ్చింది. ఈ గిరినాగును కొట్టే ధైర్యం చేయలేకపోయారు వాళ్లు. కొంతసేపటి తర్వాత గిరినాగు వెళ్లిపోతుంది.. తాము కూడా ఇంటికి వెళ్లొచ్చని అక్కడే వెయిట్ చేశారు. అయితే ఎంత సేపు ఉన్నా గిరినాగు మాత్రం రోడ్డు పై నుండి కదల్లేదు. ఇక చేసేది లేక కొంతమంది ధైర్యం తెచ్చుకొని గిరినాగును అక్కడి నుండి పంపేందుకు కేకలు వేస్తూ అందుబాటులో ఉన్న వస్తువులను గిరినాగు పై విసురుతూ దానిని పక్కనే ఉన్న పొదల్లోకి పంపే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్తుల వ్యవహారంతో గిరినాగు మరింత రెచ్చిపోయి బుసలు కొట్టడం ప్రారంభించింది. అప్పటికే సమయం రాత్రి 10:30 అయ్యింది.

మరిన్ని వీడియోల కోసం :

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్‌..పడిపోయిందా ఒకే..! లేదంటే వీడియో