చర్చిలో దూరిన అనుకోని అతిథి.. పరుగో.. పరుగు !!

|

Sep 18, 2023 | 7:35 PM

తెల్లారితే ఆదివారం.. యధావిధిగా శనివారం రాత్రి నుంచే ప్రార్ధనలకు చర్చిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు నిర్వాహకులు. అయితే పిలవని పేరంటానికి వచ్చినట్టు అనుకోని అతిధిలా ఐదడుగుల తాచుపాము చర్చిలో ప్రత్యక్షం అయింది. దీంతో చర్చిలోని సిబ్బంది భయంతో వణికిపోయారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే స్నేక్‌ క్యాచర్‌ తాచుపామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలివేసేందుకు తీసుకెళ్ళడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.

తెల్లారితే ఆదివారం.. యధావిధిగా శనివారం రాత్రి నుంచే ప్రార్ధనలకు చర్చిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు నిర్వాహకులు. అయితే పిలవని పేరంటానికి వచ్చినట్టు అనుకోని అతిధిలా ఐదడుగుల తాచుపాము చర్చిలో ప్రత్యక్షం అయింది. దీంతో చర్చిలోని సిబ్బంది భయంతో వణికిపోయారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే స్నేక్‌ క్యాచర్‌ తాచుపామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలివేసేందుకు తీసుకెళ్ళడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాచుపాములు ఇళ్ళల్లోకి, జనావాస ప్రాంతాల్లోకి తరచుగా వస్తున్నాయి. రాత్రి పూట సంచారం లేని దేవాలయాల్లోకి వస్తున్నాయి. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని ఎస్‌సి కాలనీలోని చర్చిలో ఐదు అడుగుల ప్రమాదకరమైన త్రాచు పాము వచ్చి చేరింది. మెట్లకింద కూర్చుని బుసులు కొట్టింది. భయభ్రాంతులకు గురైన స్థానికులు ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ నిరంజన్ కు సమాచారమిచ్చారు. త్రాచు పాముని పట్టుకొని దోర్నాల సమీపంలోని నల్లమల ఫారెస్ట్‌లో వదిలివేస్తున్నట్లు నిరంజన్ తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగలి పట్టే రైతులు క్రికెట్‌ బ్యాట్‌ పట్టి పరుగులు !! ఉత్సాహంగా పాల్గొన్న అన్నదాతలు

కుస్తీ పట్టాల్సిన రెజ్లర్లు నాటు నాటు అంటూ స్టెప్పులు !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ట్రెడ్‌మిల్‌పై కుప్పకూలిన యువకుడు !! చివరికి ??

నేను బతికే అవకాశం లేదు.. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో.. జవాన్‌ ఆవేదన