లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఖమ్మంలో రూ.25 లక్షల విలువైన ఇంటిని రూ.250 లక్కీ డ్రా కూపన్‌తో అందించే పథకం వెలుగులోకి వచ్చింది. సొంతింటి కలను ఆసరాగా చేసుకుని, నిర్వాహకులు ఈ ఆఫర్‌ను ప్రకటించగా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, ఇది మోసంగా తేలడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకొని, నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. మధ్యతరగతి ప్రజల ఆశలను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు.
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. చిన్నదో పెద్దదో ఓ ఇల్లు సొంతంగా కట్టుకోవాలని సాధారణ మధ్యతరగతి ప్రజలు భావిస్తారు. తమకు ఉన్న సంపాదనలో కొద్ది భాగం ఇల్లు కోసం రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇపుడున్న పరిస్థితుల్లో సొంతిల్లు సమకూర్చుకోవడం మధ్య తరగతి ప్రజలకు భారంగానే మారింది. పట్టణాల్లో అయితే పెరిగిన ధరలతో సొంత ఇల్లు కలగానే మారింది. అయితే ఖమ్మం లో ఓ ఇల్లు ఓనర్ వినూత్న ఆఫర్ తో..ముందుకు వచ్చాడు. ఖమ్మం లో లక్కీ డ్రా పేరుతో ఇళ్ల అమ్మకాలు చేస్తున్నారు. ఖమ్మం జయ నగర్ కాలని లో 130 గజాల్లో రూ 25 లక్షలు విలువగల ఇల్లు అమ్మేందుకు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. రూ 250 చెల్లించి లక్కీ డ్రా లో పాల్గొనాలనీ ఆఫర్.పెట్టారు… డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున డ్రా తీస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ ను నమ్మి కొందరు డబ్బులు చెల్లించి డ్రా కూపన్ తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఖమ్మం అర్బన్ పీఎస్ లో నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
Telangana: రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు… చిన్న పిల్లరా
