Railway Reservation: రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్ ఇవే.!
దూర ప్రయాణాలకు అనువైన సాధనం రైలు. చాలామంది దూర ప్రయాణాలకు రైలునే ఎంచుకుంటారు. వృద్ధులు, చిన్నపిల్లలతో ప్రయాణించేవారికి రైలు ప్రయాణం అత్యంత సౌకర్యవంతమైనదిగా చెప్పవచ్చు. ఇక రైల్లో ప్రయాణించేవారు ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకుంటారు. తాజాగా ఇండియన్ రైల్వే ఈ అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌కి సంబంధించి కీలక మార్పులు చేసింది.
ఇండియన్ రైల్వే అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌కి సంబంధించి కీలక మార్పులు చేసింది. దీపావళి పండుగకు ముందు ఈ కీలక మార్పును ప్రకటించింది. రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌ను 60 రోజులకు కుదించింది. ఇప్పటివరకు ఇది 120 రోజులుగా ఉంది. రైల్వే నిబంధనల ప్రకారం రైలు నిర్ణీత సమయానికి 120 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే నవంబర్ 1వ తేదీ నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే నవంబర్ 1వ తేదీకి ముందు బుకింగ్ చేసుకున్న వారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. కాగా, తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్, తదితర ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో బుకింగ్ నిబంధన యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ సమయం ఇప్పటికే తక్కువగా ఉంది. అదే సమయంలో విదేశీయులకు 365 రోజుల అడ్వాన్స్ బుకింగ్ సమయం కొనసాగుతుందని వెల్లడించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.