ఒక్క రోజులో 81 కోర్సులు కంప్లీట్​!! భారత మహిళ రికార్డ్‌ !!

|

Sep 09, 2022 | 9:52 AM

మన దేశానికే చెందిన రెహనా షాజహాన్ అనే మహిళ సింగిల్‌ డేలో 81 కోర్సులు కంప్లీట్‌ చేసి రికార్డ్‌ సృష్టించారు. రెహనా సోదరి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది.

మన దేశానికే చెందిన రెహనా షాజహాన్ అనే మహిళ సింగిల్‌ డేలో 81 కోర్సులు కంప్లీట్‌ చేసి రికార్డ్‌ సృష్టించారు. రెహనా సోదరి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది. ఆమెలా సెంట్రల్‌ యూనివర్సిటీలో చదవాలన్న ఆశయంతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంకామ్‌ ఎంట్రన్స్‌ రాసారు. కానీ హాఫ్‌ మార్కు తేడాతో అడ్మిషన్‌ కోల్పోయారు.
ఏడాది సమయం వృధా చేయడం ఎందుకని డిస్టెన్స్ కోర్సులు చేసారు. తర్వాతి ఏడాది జామియాలో సీటు సంపాదించి ఎంబీఏ పూర్తి చేసారు. కోవిడ్‌ టైమ్‌లోఆన్ లైన్ కోర్సులు చేయడం మొదలుపెట్టిన రెహానా ఒకే రోజులో 55 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేసారు. ఈ విషయాన్ని ఆమె పనిచేసిన సంస్థ సీఈఓతో చెబితే.. వరల్డ్‌ రికార్డ్‌ కు ప్రయత్నం చేయమని సలహా ఇచ్చారు. అప్పటికి ప్రపంచ రికార్డు 24 గంటల్లో 75 కోర్సులుగా ఉంది. దీంతో ప్రయత్నం మొదలుపెట్టిన రెహనా.. 24 గంటల్లో 81 కోర్సులు పూర్తి చేసి.. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. దుబాయ్‌ లోని ఓ కంపెనీలో హెచ్‌ ఆర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రెహనా తన తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా వచ్చేసారు. ఇక్కడ విద్యార్థులకు కెరీర్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోచ్‌ గా పనిచేస్తూ.. ఆన్‌ లైన్‌ కోర్సులు చేయడంపై శిక్షణ ఇస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉల్లి డయాబెటిస్‌కు చెక్‌ పెడుతుందా ?? పరిశోధన ఏం చెబుతుంది ??

2200 ఏళ్ల నాటి నరకానికి ప్రవేశ మార్గం !! చెక్కు చెదరలేదు

Viral Video: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ !!

పెద్దాయనే కానీ.. గట్టాయన.. తన డ్యాన్స్ తో నెటిజన్స్ ఫిదా చేసిన.. ఓల్డర్ యంగ్ మ్యాన్

Ganesh Nimajjanam: బై బై గణేశ.. హుస్సేన్ సాగర్ కు తరలివస్తున్న గణనాథులు

 

Published on: Sep 09, 2022 09:52 AM