Viral: రూ. 45 వేలకే ‘రోల్స్‌ రాయిస్‌’లుక్‌.. కుర్రోడి టాలెంట్‌కు ఇంటర్నెట్‌ ఫిదా.

|

Oct 03, 2023 | 1:36 PM

ఐడియా వెలగాలే కానీ ఈ లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదేమో. కేరళకు చెందిన ఒక యువకుడు ఇదే విషయాన్ని మరో సారి రుజువు చేశాడు. తన దగ్గర ఉన్న బడ్జెట్‌ కారు మారుతి 800ని ఏకంగా లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు. దీనికి ఖర్చు చేసింది కూడా కేవలం 45 వేల రూపాయలు. ఈ వీడియో ఐదు రోజుల్లో దాదాపు 3 లక్షల వ్యూస్‌ సంపాదించింది.కేరళకు చెందిన 18 ఏళ్ల హదీఫ్‌.. ఆటోమొబైల్ ఔత్సాహికుడు.

ఐడియా వెలగాలే కానీ ఈ లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదేమో. కేరళకు చెందిన ఒక యువకుడు ఇదే విషయాన్ని మరో సారి రుజువు చేశాడు. తన దగ్గర ఉన్న బడ్జెట్‌ కారు మారుతి 800ని ఏకంగా లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు. దీనికి ఖర్చు చేసింది కూడా కేవలం 45 వేల రూపాయలు. ఈ వీడియో ఐదు రోజుల్లో దాదాపు 3 లక్షల వ్యూస్‌ సంపాదించింది. కేరళకు చెందిన 18 ఏళ్ల హదీఫ్‌.. ఆటోమొబైల్ ఔత్సాహికుడు. సాధారణ కార్లను.. విలాసవంతమైన కార్లలాగా మోడిఫై చేయడం ఇష్టమని, అందుకే రోల్స్ రాయిస్ లాంటి కారును, లోగోను సృష్టించానని చెప్పుకొచ్చాడు. రోల్స్ రాయిస్ తరహాలో ముందు భాగంలో పెద్ద సైజు గ్రిల్‌ను అమర్చాడు. ‘స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ’ అని రాసి ఉన్న కార్ బానెట్‌ని కూడా అందించాడు. ఇదంతా కేవలం రూ.45 వేలలోనే చేశానని చెప్పాడు. అయితే, హదీఫ్‌ ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో అతను మోటార్‌ సైకిల్ ఇంజిన్‌ని ఉపయోగించి జీప్‌ను తయారు చేశాడట. అంతేకాదు ఇలాంటి ఆకర్షణీమైన కార్లను చాలా సులువుగా తయారు చేయగలనని వెల్లడించాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా శ్రీనగర్‌కు చెందిన ఒక గణిత ఉపాధ్యాయుడు బిలాల్ అహ్మద్‌.. చెత్తనుంచి సౌరశక్తితో నడిచే కారును తయారు చేశాడు. కారు బానెట్, బూట్, కిటికీలపై కూడా సోలార్‌ ప్యానెల్స్‌ అమర్చాడు. అవసరమైన ఆర్థిక సాయంలేక దీనికి 11 ఏళ్లు పట్టిందని, లేదంటే తాను కశ్మీర్‌కు చెందిన ఎలాన్ మస్క్‌గా మారేవాడిని అతను వ్యాఖ్యానించాడు ఇది మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించడం, సహాయం అందించడం చకచకా జరిగిపోయాయి. మన దేశంలో టాలెంట్ కు కొదవలేదు. కావాలసిందల్లా ప్రోత్సాహం.. ఆర్థిక సాయం. నిజానికి ఇలాంటి యువ శాస్త్రవేత్తలను ఆర్థికంగా ప్రోత్సహిస్తే.. దానివల్ల ఔత్సాహిక శాస్త్రవేత్తలను, వ్యాపారవేత్తలను తయారుచేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు ఏది కావాలన్నా.. అమెరికా వైపో మరో దేశంవైపో చూడాల్సిన అవసరం ఉండదు. మన దేశంవైపే అందరూ చూస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..