కాలికి గాయమైందంటూ పోలీసులకు ఫోన్ !! డాక్టర్ చికిత్స చేస్తుండగా ??
కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనకు చికిత్స చేస్తున్న డాక్టర్‌పై విచక్షణారహితంగా కత్తెరతో దాడికి తెగబడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో డాక్టర్ మృతిచెందారు. కొల్లాం జిల్లాలోని ఓ ఎయిడెడ్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న సందీప్ అనే వ్యక్తి డ్రగ్స్‌కు పూర్తిగా బానిసై తోటి ఉపాధ్యాయులను..
కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనకు చికిత్స చేస్తున్న డాక్టర్‌పై విచక్షణారహితంగా కత్తెరతో దాడికి తెగబడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో డాక్టర్ మృతిచెందారు. కొల్లాం జిల్లాలోని ఓ ఎయిడెడ్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న సందీప్ అనే వ్యక్తి డ్రగ్స్‌కు పూర్తిగా బానిసై తోటి ఉపాధ్యాయులను, స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇందులో భాగంగా మంగళవారం తన కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత అతడే స్వయంగా పోలీసులకు సమాచారం అందించి.. తన కాలికి గాయమైందని.. అస్సలు నడవలేకపోతున్నానంటూ పదే పదే ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని సందీప్‌ను కొట్టారక్కరా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్ వందనా దాస్ సందీప్‌కి వైద్య పరీక్షలు నిర్వహించింది. కాలికి గాయమైనట్లు గుర్తించి, చికిత్స చేయడం ప్రారంభించింది. అప్పుడే నిందితుడు సందీప్ ఒక్కసారిగా రెచ్చిపోయి.. ఆమెపై కత్తెరతో దాడి చేశాడు. వైద్యురాలి ఛాతిపై ఐదుసార్లు పొడిచాడు. దీంతో బాధితురాలిని హుటాహుటిన తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ లేడి బాడీ బిల్డర్‌కు సోషల్ మీడియాలో ఫుల్ ఫాన్ ఫాలోయింగ్..
కారులో బుసకొట్టిన నాగు పాము.. స్నేక్ క్యాచర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
WhatsApp: వాట్సాప్‌లో త్వరలో మరో కొత్తఫీచర్.. ఆ ఆప్షన్ వస్తే..
డ్యూటీనుంచి ఇంటికొచ్చిన భర్తకు ఘనంగా స్వాగతం పలికిన భార్య.. వీడియో చూస్తే షాకే
Rowdy Rohini: ఆస్పత్రిలో ‘బలగం’ నటి రౌడీ రోహిణి.. ఏమైందంటే ??