కేరళ అమ్మాయిని పెళ్లాడిన అమెరికా యువకుడు.. పారిస్‌ కలిపింది ఆ ఇద్దరినీ
Love Marriage

కేరళ అమ్మాయిని పెళ్లాడిన అమెరికా యువకుడు.. పారిస్‌ కలిపింది ఆ ఇద్దరినీ

Updated on: Sep 05, 2025 | 4:03 PM

ప్రేమకు దేశాలు, సంస్కృతులు, భాషలు వంటి హద్దులు ఉండవని మరోసారి నిరూపితమైంది. అమెరికాకు చెందిన యువకుడు, కేరళకు చెందిన యువతి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫ్రాన్స్‌లో మొదలైన వీరి ప్రేమకథ, కేరళలోని కొచ్చిలో పెళ్లి పీటల వరకు చేరింది. ఎర్నాకుళంకు చెందిన అంజలి, అమెరికా వాసి అయిన రాబర్ట్‌ వెల్స్‌ మూడేళ్ల క్రితం ఫ్రాన్స్‌లో కలుసుకున్నారు.

అక్కడ ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం, కొద్దికాలానికే ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పి, వారి అంగీకారం కూడా పొందారు. ఓనం పండగ సందర్భంగా ఇటీవల అంజలి స్వస్థలమైన ఫోర్ట్ కొచ్చికి వచ్చిన రాబర్ట్, స్థానిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద ఆమెను పెళ్లాడాడు. ఈ వేడుకలో వధూవరులిద్దరూ కేరళ సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. వివాహం అనంతరం రాబర్ట్ స్వయంగా అందరికీ మిఠాయిలు పంచి తన సంతోషాన్ని పంచుకోవడం విశేషం. తన భర్త రాబర్ట్‌కు భారతీయ సంస్కృతి, ముఖ్యంగా కేరళ వంటకాలంటే చాలా ఇష్టమని అంజలి తెలిపారు. తమ అల్లుడు అమెరికా వ్యక్తి కావడం పట్ల అంజలి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు అమెరికా అల్లుడు రావడం చాలా గర్వంగా, సంతోషంగా ఉందని వారు అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: బంగారం ధర మరింత పైపైకి.. తులం ఎంతంటే