Kashmir: భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా

Updated on: Jan 25, 2026 | 6:02 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కుదేలైన కశ్మీర్ పర్యాటక రంగం శీతాకాలంలో మళ్ళీ కళకళలాడుతోంది. 2024లో రికార్డు స్థాయిలో 30 లక్షల మంది పర్యాటకులు భూతల స్వర్గాన్ని సందర్శించారు. మంచుతో కప్పిన గుల్ మార్గ్, గడ్డకట్టిన దాల్ సరస్సు ఆకర్షణీయంగా మారాయి. లక్షలాది కుటుంబాలకు ఊరటనిస్తూ, కశ్మీర్ లోయ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది.

భూతల స్వర్గం కశ్మీర్ మళ్లీ పర్యాటకులతో కళకళలాడుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత కుదేలైన పర్యాటక రంగం.. ఇప్పుడు శీతాకాలంలో సరికొత్త ఊపిరి పోసుకుంటోంది. మంచుతో కప్పిన పర్వతాలు, గడ్డకట్టిన సరస్సులు పర్యాటకుల్ని కట్టిపడేస్తుంటే.. కాశ్మీరీల మొహాల్లో మళ్లీ ఆనందం కనిపిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని అధికారులు మూసేసారు. శ్రీనగర్‌కు రావాల్సిన దాదాపు 20 విమానాలు రద్దయ్యాయి. రాజౌరీ, పూంఛ్, కతువాలో చాలా ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారాయి. ఈ సీజన్‌లో తొలిసారి త్రికూట పర్వతాల్లో మంచు కురిసింది. దాంతో వైష్ణోదేవీ యాత్రను అధికారులు రద్దు చేశారు. రోడ్లపై పేరుకుపోయిన మంచును భారీ యంత్రాలతో తొలగిస్తున్నారు. 2024లో రికార్డు స్థాయిలో దాదాపు 30 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్ లోయను సందర్శించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం గుల్‌మార్గ్, సోన్‌మార్గ్, పహల్గామ్ వంటి ప్రాంతాల్లో హోటళ్లు 80 శాతం నుంచి 90శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. డిసెంబర్, జనవరిలో గుల్ మార్గ్ లోని వరల్డ్ ఫేమస్‌ స్కీ రిసార్ట్ పర్యాటకులతో కిక్కిరిసిపోతోంది. గడ్డకట్టిన దాల్ సరస్సుపై షికారా ప్రయాణం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. కేవలం పర్యాటక రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలకు ఈ రద్దీ పెద్ద ఊరటనిస్తోంది. షికారా వాలాలు, స్లెడ్జ్‌ రైడ్ వాలాలు, ట్యాక్సీ డ్రైవర్లు మళ్లీ బిజీ అయ్యారు. ప్రకృతి అందాల మధ్య కాశ్మీర్ లోయ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూపాయి @ రూ 91.65.. ఎందుకీ పరిస్థితి ??

మా వేలు ట్రిగ్గర్‌ పైనే ఉంది.. ట్రంప్‌కు ఇరాన్‌ వార్నింగ్‌

భారీ వర్షంలోనూ పరేడ్‌.. ఆసక్తిగా తిలకించిన జనం

పడిపోయినా వదల్లేదు.. రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు

రైల్వేలో రోబో క్యాప్‌.. విధుల్లోకి అర్జున్‌