శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా
ఉత్తరాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, హిమాచల్‌లో భారీ మంచు కురుస్తోంది, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గుల్‌మార్గ్, సోనామార్గ్ సహా పలు ప్రాంతాలు మంచుతో కప్పబడ్డాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో జనజీవనం, వాహన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేశారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మంచు తొలగింపు చర్యలు చేపట్టింది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.
ఉత్తరాది రాష్ట్రాలు ప్రస్తుతం కఠినమైన శీతల గాలులతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా జమ్ము–కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. జమ్ము–కశ్మీర్‌లోని గుల్‌మార్గ్ స్కీ రిసార్ట్, సోనామార్గ్, దూద్‌పత్రి సహా దక్షిణ, ఉత్తర కశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతాలన్నీ పూర్తిగా తెల్లని మంచు పొరతో కప్పబడి, అద్భుతమైన దృశ్యాలను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపై రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోవడంతో వాహన రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా జమ్ము–శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది. స్నో కట్టర్లు, డోజర్ల సాయంతో రోడ్లపై పేరుకుపోయిన మంచును వేగంగా తొలగిస్తున్నారు. మరోవైపు నిరంతర మంచు వర్షం కారణంగా భారీగా మంచు పేరుకుపోవడంతో రజ్దాన్ టాప్ మార్గంగా ఉన్న 85 కిలోమీటర్ల గురేజ్–బండిపోరా రహదారి మూసివేశారు. విద్యుత్, నీటి సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు, రహదారి క్లియరెన్స్ పనులు పూర్తయ్యే వరకు ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sweet Potato: చిలగడదుంపతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు
కల్కి సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. నిజంగానే ఉంది
రోగి గొంతులో బ్రతికున్న జలగ.. కట్ చేస్తే చేస్తే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్
Chandrahas: చంద్రహాస్ మరీ ఇంత వల్గరా ?? స్టేజ్ మీద ఆ బూతు పాట ఏంటి ?? నెటిజన్ల ఫైర్
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ.720 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం