బెళగావి జిల్లాలో ఇటీవలే జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. దాన్ని దిద్దుతున్న టీచర్ అందులో రాసిన కథ చూసి షాకయ్యారు. పదో తరగతి పాసైతేనే ప్రేమ కొనసాగిస్తానని తన గర్ల్‌ఫ్రెండ్ చెప్పిందని జవాబు పత్రంలో రాసిన విద్యార్థి నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. అమ్మాయి ప్రేమ కొనసాగాలంటే నేను పాస్ కావాలి. దయచేసి ఎలాగైనా నన్ను పాస్ చేయండి. అప్పుడే తన ప్రేమ నిలుస్తుందని రాసుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా ఆన్సర్ షీట్ మధ్యలో 500 రూపాయల నోటు కూడా పెట్టాడు. ఈ డబ్బులతో టీ తాగి తనను ఎలాగైనా పాస్ చేయాలని అభ్యర్థించాడు. మూల్యాంకనం చేస్తున్న క్రమంలో పేపర్ మధ్యలో డబ్బులు చూసి ఉపాధ్యాయుడు షాకయ్యాడు. ఆ తర్వాత ఆన్సర్ షీట్లో రాసింది చదివి అవాక్కయ్యాడు. ఇది కాస్త సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :